
బీజేవైఎం జిల్లా అధ్యక్షుడుగా శ్రీధర్
శంషాబాద్ రూరల్: భారతీయ జనతా పార్టీ యువ మోర్చా జిల్లా అధ్యక్షుడుగా మండలంలోని తొండుపల్లికి చెందిన ఎంపీటీసీ సభ్యుడు బైతి శ్రీధర్‌యాదవ్ నియమితులయ్యారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి ఈమేరకు ఆయనకు నియామకపత్రం అందజేశారు. ఏబీవీపీ జిల్లా కన్వీనర్‌గా, శంషాబాద్ బాగ్ కన్వీనర్‌గా, జిల్లా కో-కన్వీనర్‌గా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడుగా పని చేసిన శ్రీధర్ బీజేవైఎం జిల్లా అధ్యక్షుడుగా నియమితులు అయ్యారు. ఈ సందర్భంగా శనివారం విలేకరులతో శ్రీధర్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను నిర్వర్తిస్తూ పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని చెప్పారు. జిల్లాలో 2019 సంస్థాగత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తామన్నారు.