తెలంగాణపై మాట్లాడిన చీఫ్ విప్ గండ్ర
దయాకర్‌రావు, వినయ్, శ్రీధర్‌కు కూడా అవకాశం
ఎర్రబెల్లి, దాస్యం నడుమ వాగ్వాదం
వరంగల్, న్యూస్‌లైన్ : ఆరు దశాబ్దాల తెలంగాణ ఏ ర్పాటు కల సాకారమయ్యే సమయంలో బిల్లుకు అడ్డం కులు సృష్టించడం సరైంది కాదు. ఇప్పటికే సీమాంధ్ర పాలనలో తెలంగాణకు అన్ని రంగాల్లో అన్యాయం జరి గింది. ఆత్మగౌరవం, స్వయం పాలన లక్ష్యంగా ప్రత్యేక రాష్ట్రం కోరుకుంటున్నాం. శాసనసభలో ప్రవేశపెట్టిన తెలంగాణ బిల్లుకు సంపూర్ణ మద్దతునిస్తూ .. స్వాగతం తెలియజేస్తున్నామంటూ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లుపై అసెంబ్లీలో జరుగుతున్న చర్చ సందర్భంగా జిల్లాకు చెందిన చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, టీ టీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడారు. అలాగే, దాస్యం వినయ్‌భాస్కర్, కొండేటి శ్రీధర్‌కు మాట్లాడే అవకాశం లభించింది. అయితే, ఎర్రబెల్లి తన ప్రసంగంలో అమరువీరుల కుటుంబాలను ఆదుకోలేదంటూ టీఆర్‌ఎస్ నేతలపై విమర్శలు చేశారు. దీంతో వినయ్‌భాస్కర్ కూడా తాను మాట్లాడిన సమయంలో దయాకర్‌రావుపై విరుచుకుపడ్డారు. తమ జిల్లాలో ఎర్రబెల్లి దయాకర్‌రావును డీలర్ దయాకర్‌రావు అంటారని.. ఆయన ప్రస్తుతం డీలర్ నుంచి డాలర్ స్థాయికి ఎదిగారని మండిపడ్డారు. ఈక్రమంలో ఇరువురి నడుమ వాడీవేడీ విమర్శలు చోటుచేసుకున్నాయి. కాగా, వినయ్‌భాస్కర్, కొండేటి శ్రీధర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు వారి మాటల్లోనే..
ఆజంజాహిని మింగేశారు: వినయ్
నిజాం హయంలో వరంగల్‌లో ఏర్పాటు చేసిన ఆజం జాహి మిల్లును మింగేశారు. భూమి కూడా లేకుండా చేశారు. సీమాంధ్రపాలనలో జిల్లాకు జరిగిన అన్యాయాన్ని వివరించేందుకు ఇంత కంటే ఉదాహరణ అవసరం లేదు. ఇక మహబూబ్‌నగర్ జనం వలసబాట పట్టగా, రంగారెడ్డి, హైదరాబాద్ రైతులు వారి భూముల్లోనే కూలీలుగా మారారు. నల్లగొండ ప్రజలకు ఫ్లోరైడ్ మహమ్మారి మిగలగా, చేనేత కార్మికులకు ఆత్మహత్యలే దిక్కయ్యాయి. అలాగే, ఖమ్మంలో భూగర్భ వనులను కొల్లగొట్టారు. ఈక్రమంలో స్వయం పాలన కోసం జరిగిన తెలంగాణ ఉద్యమంలో ఎందరో అమరవీరులయ్యారు. తెలంగాణ పదాన్ని శాసనసభలో మాట్లాడకుండా టీడీపీ హయంలో నిషేధించారు.
షరతులు లేని తెలంగాణ కావాలి: కొండేటి
షరతులు లేని తెలంగాణ కావాలి. రాష్ట్ర ఏర్పాటుసందర్భంగా హైదరాబాద్‌పై ఎలాంటి ఆంక్షలు విధించరాదు. అనేక మంది అమరుల త్యాగఫలితం, కాంగ్రెస్ పార్టీ సాహసోపేత నిర్ణయం వల్ల తెలంగాణ సాకారమైంది. బడుగువర్గాల నేత అంబేద్కర్ ఆలోచన మేరకే తెలంగాణ ఆకాంక్ష ఫలించే సమయం ఆసన్నమైంది. నియోజకవర్గాన్ని ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయినప్పటికీ వచ్చిన మేరకు కృషి చేశాను. ఎయిర్‌పోర్ట్, డీ ఫ్లోరైడ్ ప్రాజెక్టుల ఏర్పాటుకు శ్రద్ధ వహించాను. రానున్న తెలంగాణ రాష్ట్రంలో మరింత అభివృద్ధికి కృషి చేయాల్సి ఉంది.
అసెంబ్లీలో గొంతెత్తిన జిల్లా ఎమ్మెల్యేలు
Published Sat, Jan 25 2014 2:31 AM | Last Updated on Sat, Sep 2 2017 2:57 AM
Advertisement
Advertisement