
అంతా కొత్త వాళ్లతో...
‘గోవిందా గోవిందా’, ‘స్వామి రారా’ తరహాలో ‘ఓం మంగళం మంగళం’ పేరుతో ఓ కామెడీ థ్రిల్లర్ రూపొందనుంది. ‘మధుర’ శ్రీధర్, డా. ఎం.వి.కె. రెడ్డి నిర్మించనున్న ఈ చిత్రం ద్వారా సంజీవరెడ్డి దర్శకునిగా పరిచయం కానున్నారు. ఈ సినిమా విశేషాలను ‘మధుర’ శ్రీధర్ తెలియజేస్తూ -‘‘మాఫియా నేతృత్వంలో నడిచే కథ ఇది. కథానుగుణంగా నటీనటులందరూ కొత్తవారైతేనే బాగుంటుందనిపించింది. అందుకే ఆన్‌లైన్‌లో స్టార్‌హంట్ నిర్వహించనున్నాం. జనవరి 15లోగా నటీనటుల్ని ఎంపిక చేసి, అదే నెలాఖరులో షూటింగ్ మొదలు పెడతాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, సహనిర్మాత: రాజ్ కందుకూరి.