కిరణ్మయి, శ్రీధర్, దుర్గ
శ్రీధర్, దుర్గ జంటగా కిరణ్ దుస్సా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కళాకారుడు’. శ్రీధర్ శ్రీమంతుల నిర్మించిన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా కిరణ్ దుస్సా మాట్లాడుతూ– ‘‘వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. అన్నివర్గాల ప్రేక్షకులకు మా సినిమా నచ్చుతుంది. దర్శకునిగా అవకాశం ఇచ్చిన శ్రీధర్‌గారికి కృతజ్ఞతలు’’ అన్నారు. ‘‘ప్రతి సాంకేతిక నిపుణుడు సొంత సినిమాలా భావించి ఈ సినిమా కోసం పనిచేశారు. సినిమా బాగా వచ్చింది. త్వరలోనే విడుదల చేస్తాం’’ అన్నారు శ్రీధర్. ‘‘కథ వినగానే నచ్చింది’’ అన్నారు దుర్గ. ‘‘5 పాటలు చక్కగా కుదిరాయి. శ్రీధర్‌గారికి సినిమా పిచ్చి’’ అన్నారు సంగీత దర్శకుడు రఘురామ్.
Comments
Please login to add a commentAdd a comment