ఓటర్ల నమోదు కార్యక్రమానికి ఈ నెల 23తో గడువు ముగుస్తున్నందున అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటర్లుగా నమోదు చేయాలని కలెక్టర్ శశిధర్ ఆదేశించారు.
కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఓటర్ల నమోదు కార్యక్రమానికి ఈ నెల 23తో గడువు ముగుస్తున్నందున అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటర్లుగా నమోదు చేయాలని కలెక్టర్ శశిధర్ ఆదేశించారు. ఆదివారం తన క్యాంపు కార్యాలయం నుంచి ఈఆర్‌ఓలు, ఏఈ ఆర్‌ఓలతో నిర్వహించిన సెట్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడా రు. క్లెయిమ్స్‌లు, అభ్యంతరాలపై వచ్చిన దరఖాస్తులను తక్షణ మే పరిష్కరించాలని చెప్పారు. సాయంత్రంలోపు వీలైనంత ఎక్కువగా వీటిని పరిష్కరించాలన్నారు. సోమవారం ఎన్నికల కమిషన్ అధికారులతో హైదరాబాదు జూబ్లీ హాలులో కలెక్టర్ల సమావేశం ఉన్నందున అర్జీల పరిష్కారంపై శ్రద్ధ చూపాలన్నా రు.
పోలింగ్ కేంద్రాల్లో బీఎల్‌ఓలు అందుబాటు లో ఉండాలన్నారు. వీరితోపాటు ఐకేపీ సిబ్బంది, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు ఉండడం వల్ల 18-19 ఏళ్ల ఓటర్లు, లింగ నిష్పత్తి వివరాలను బూత్ లెవెల్‌లో సులభంగా పరిశీలించే అవకా శం ఉంటుందన్నారు. తొలగించిన ఓటర్ల జాబితాను పోలింగ్ కేంద్రాల వద్ద ప్రదర్శించాలని సూచించారు. సిద్దవటం మండలంలోని ఏపీఎస్‌పీ బెటాలియన్ పోలీసు సిబ్బందిని ఓటర్ల జాబితాలో నమోదు చేయించాలని రాజం పేట సబ్ కలెక్టర్, తహశీల్దార్లను ఆదేశించారు. ఇతర మండలాల్లోని తహశీల్దార్లు సంబంధిత స్టేష న్ హౌస్ అదికారులతో సంప్రదించి పోలీసు సిబ్బంది అంతా ఓటర్లుగా నమోదయ్యేలా చూడాలని కోరారు. డూప్లికేట్ ఓటర్లను, చనిపోయిన వారిని, ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన వారిని జాబితాల్లోంచి తొలగించాలన్నారు. వచ్చిన దరఖాస్తులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. బోగస్ ఓట్లపై ఫిర్యాదులపై స్పందించాలని ఆదేశించారు. జేసీ నిర్మల, ఏజేసీ సుదర్శన్‌రెడ్డి, డీఆర్వో ఈశ్వరయ్య పాల్గొన్నారు.
ఆన్‌లైన్‌లోనే ఎక్కువగా నమోదు
ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం ఆదివారం ముగి సింది. అర్హులందరినీ ఓటర్లుగా నమోదు చేయాలన్న ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో ఇప్పటికే నాలుగు పర్యాయాలు స్పెషల్ క్యాంపియన్ డేలు నిర్వహించారు. రానున్న సాధారణ ఎన్నికల కోసం ఓటర్ల జాబితా తయారీకి చేపట్టిన ఈ కార్యక్రంలో యువత నమోదుపై ప్రత్యేక శ్ర ద్ధ చూపారు. జిల్లా జనాభా గణాంకాల ప్రకారం చూ స్తే 18-19 ఏళ్లు నిండిన యువత నాలుగు శాతం ఉంది.
ముసాయిదా జాబితాను పరిశీలిస్తే వీరి నమోదు చాలా స్వల్పంగా ఉంది. దీంతో వీరిపై ప్రత్యేక దృష్టి సారించి ఓటర్లుగా నమోదు చేయాలని ఈసీ ఆదేశించింది. జిల్లాలోని కళాశాలల్లో నమోదుపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఈ ప్రక్రియ ప్రారంభమయ్యాక గతానికి భిన్నంగా ఎక్కువ మంది ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు చేసుకోవడం విశే షం. ఇంకా నమోదు చేసుకోని వారు సోమవారం కూడా నమోదు చేసుకోవచ్చు.
కనిపించని బీఎల్‌ఓలు .. చివరి ఆదివారం పోలింగ్ కేంద్రాల వద్ద బీఎల్‌ఓలు కచ్చితంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. కొన్ని చోట్ల బీఎల్‌ఓలు కని పించకుండా పోయారు. దీంతో ఓటు నమోదు, ఇతర క్లెయిమ్స్ కోసం వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడ్డారు. గౌస్‌నగర్ ఉర్దూ పాఠశాలలో పోలింగ్ కేంద్రం ఉండగా, అక్కడ బీఎల్‌ఓలు కనిపించకుండా పోయారు.