ముదిగొండ, న్యూస్‌లైన్: ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో చట్టాలు వేర్వేరుగా ఉన్నాయని సమాచార హక్కు చట్టం కేంద్ర కమిషనర్ మాడభూషి శ్రీధర్ అన్నారు. ‘భూమి హక్కుల చైతన్య యాత్ర’లో భాగంగా ఆదివారం ఆయన ముదిగొండ మండలం మేడేపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో ఈ ప్రాంతంలోని భూ సమస్యలకు సంబంధించి నూతన చట్టాలు తీసుకురావాలనే అంశంపై రైతులు, ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలు తెలుసుకుంటున్నామని అన్నారు.
భూ కొనుగోలు, వారసత్వ మార్పు చేసిన తర్వాత పట్టాల్లో మార్పులు చేయడానికి రెవెన్యూ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని రైతులు తమ దృష్టికి తీసుకువచ్చారని అన్నారు. భూములన్నీ రీసర్వే, సెటిల్‌మెంట్లు చేయాలని తెలంగాణలోని అన్ని జిల్లాల్లో నాలుగు ృందాలు పర్యటించి వివరాలు సేకరిస్తున్నారని అన్నారు. భూ సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల గురించి రైతులు, వ్యవసాయ కూలీలతో చర్చించి అభిప్రాయాలు తీసుకుని నివేదికలు తయారు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో పాలకులకు చెప్పేందుకు భూ సమస్యలపై యాత్రలు చేస్తున్నామని అన్నారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ముంపు గ్రామాలను పంచుకుంటున్నారే తప్ప ఆ గ్రామాల గురించి ఎవరూ ఆలోచించడం లేదని అన్నారు. రెవెన్యూ అధికారులు గ్రామాల్లో నివసిస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయని రైతులు తమ దృష్టికి తీసుకువస్తున్నారని, రైతుల అభిప్రాయాలను తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులకు అందజేస్తామని అన్నారు.
విలేకరుల సమావేశంలో గ్రామీణాభివృద్ధి సంస్థ దేశ డెరైక్టర్ గ్రేగర్, రాష్ట్ర డెరైక్టర్ ఎం. సునీల్‌కుమార్, రీసెర్చ్ మేనేజర్ సంతోష్, ప్రతినిధులు రవీందర్, రమేష్, ప్రభాకర్, మేడేపల్లి సర్పంచ్ కొత్తపల్లి నాగలక్ష్మి, రైతులు సామినేని ిహ మవంతరావు, పయ్యావుల లింగయ్య, పోటు ప్రసాద్ పాల్గొన్నారు.
ఆంధ్రా, తెలంగాణలో చట్టాలు వేరుగా ఉన్నాయి
Published Mon, Feb 10 2014 2:40 AM | Last Updated on Sat, Sep 2 2017 3:31 AM
Advertisement
Advertisement