Telangana area
-
ఆంధ్రా, తెలంగాణలో చట్టాలు వేరుగా ఉన్నాయి
ముదిగొండ, న్యూస్‌లైన్: ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో చట్టాలు వేర్వేరుగా ఉన్నాయని సమాచార హక్కు చట్టం కేంద్ర కమిషనర్ మాడభూషి శ్రీధర్ అన్నారు. ‘భూమి హక్కుల చైతన్య యాత్ర’లో భాగంగా ఆదివారం ఆయన ముదిగొండ మండలం మేడేపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో ఈ ప్రాంతంలోని భూ సమస్యలకు సంబంధించి నూతన చట్టాలు తీసుకురావాలనే అంశంపై రైతులు, ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలు తెలుసుకుంటున్నామని అన్నారు. భూ కొనుగోలు, వారసత్వ మార్పు చేసిన తర్వాత పట్టాల్లో మార్పులు చేయడానికి రెవెన్యూ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని రైతులు తమ దృష్టికి తీసుకువచ్చారని అన్నారు. భూములన్నీ రీసర్వే, సెటిల్మెంట్లు చేయాలని తెలంగాణలోని అన్ని జిల్లాల్లో నాలుగు ృందాలు పర్యటించి వివరాలు సేకరిస్తున్నారని అన్నారు. భూ సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల గురించి రైతులు, వ్యవసాయ కూలీలతో చర్చించి అభిప్రాయాలు తీసుకుని నివేదికలు తయారు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో పాలకులకు చెప్పేందుకు భూ సమస్యలపై యాత్రలు చేస్తున్నామని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ముంపు గ్రామాలను పంచుకుంటున్నారే తప్ప ఆ గ్రామాల గురించి ఎవరూ ఆలోచించడం లేదని అన్నారు. రెవెన్యూ అధికారులు గ్రామాల్లో నివసిస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయని రైతులు తమ దృష్టికి తీసుకువస్తున్నారని, రైతుల అభిప్రాయాలను తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులకు అందజేస్తామని అన్నారు. విలేకరుల సమావేశంలో గ్రామీణాభివృద్ధి సంస్థ దేశ డెరైక్టర్ గ్రేగర్, రాష్ట్ర డెరైక్టర్ ఎం. సునీల్‌కుమార్, రీసెర్చ్ మేనేజర్ సంతోష్, ప్రతినిధులు రవీందర్, రమేష్, ప్రభాకర్, మేడేపల్లి సర్పంచ్ కొత్తపల్లి నాగలక్ష్మి, రైతులు సామినేని ిహ మవంతరావు, పయ్యావుల లింగయ్య, పోటు ప్రసాద్ పాల్గొన్నారు. -
సీట్ల పెంపు ఖాయం!
టీ-ముసాయిదా బిల్లు రాగానే కేంద్రం పొందుపరిచే అవకాశం సాక్షి, హైదరాబాద్: రాష్ర్ట విభజన నేపథ్యంలో తెలంగాణ ప్రాంతంలో శాసనసభా స్థానాల పెంపు ప్రతిపాదనను కేం ద్రం తీవ్రంగా పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర అసెంబ్లీ నుంచి విభజన బిల్లు వచ్చిన వెంటనే ఈ ప్రతిపాదనను పొందుపరిచి కేబినెట్ ముందుకు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. పార్లమెంటు ముందుకు విభజన బిల్లు వచ్చినప్పుడు అందులో ఈ అంశం కచ్చితంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు కొందరు తెలంగాణ నేతలకు దిగ్విజయ్‌సింగ్ హామీ కూడా ఇచ్చినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చిన జాతీయ విపత్తుల నివారణా సంస్థ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్‌రెడ్డి ఆదివారం అందుబాటులో ఉన్న తెలంగాణ డీసీసీ అధ్యక్షులు, సీనియర్ నేతలతో సమావేశమై ఇదే అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా శశిధర్‌రెడ్డి తన ప్రతిపాదనపట్ల కేంద్ర ప్రభుత్వ పెద్దల ఆలోచనను వారికి వివరించారు. అసెంబ్లీ నుంచి విభజన బిల్లు కేంద్రానికి వెళ్లిన సమయంలో కేంద్ర హోంమంత్రి షిండే, జీవోఎం సభ్యుడు జైరాం రమేశ్‌తోపాటు మరికొందరు కేంద్ర పెద్దలను కలిసి ఈ ప్రతిపాదనపై మరోసారి చర్చించనున్నట్లు తెలిపారు. -
జిల్లారోడ్లకు మహర్దశ
సాక్షి, కరీంనగర్ : రాష్ట్ర విభజనతో జిల్లా రహదారులకు మహర్దశ పట్టనుంది. జిల్లాలోని రెండు రోడ్లు జాతీయ రహదార్లుగా మారనున్నాయి. రహదారుల పరంగా తెలంగాణ ప్రాంతం వెనుకబడిందని, పునర్వభజనతోపాటు ఈ ప్రాంతంలోని రహదారులను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ముసాయిదా బిల్లులో కేంద్ర మంత్రివర్గం పేర్కొంది. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిడివి 5,215 కిలోమీటర్లుకాగా, తెలంగాణలోని పది జిల్లాల్లో కేవలం 1,700 కిలోమీటర్ల నిడివి మాత్రమే ఉంది. ఈ వ్యత్యాసాన్ని సవరించేందుకు కేంద్రం చర్యలను సూచించింది. తెలంగాణ ప్రాంతంలో రహదారులను విస్తరించడం, వెనుకబడిన ప్రాంతాలకు రవాణా వసతులను మెరుగుపర్చడం లాంటి బాధ్యతలను భారత జాతీయ రహదారుల అధారిటీ (ఎన్హెచ్ఏఐ)కు అప్పగించింది. ముసాయిదాలో జాతీయ రహదారులుగా అభివృద్ధి పరచాలని ప్రతిపాదించిన ఐదు రహదారుల్లో రెండు రోడ్లు జిల్లా మీదుగా వెళ్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఐదు రహదారులను నేషనల్ హైవేలుగా మార్చాలని ఇదివరకే కేంద్ర ఉపరితల రవాణా శాఖను కోరింది. తెలంగాణపై ఏర్పాటయిన మంత్రుల బృందం దృష్టికి కూడా రోడ్లకు సంబంధించిన అంశాలు వచ్చాయి. జిల్లాలన్నింటికి మెరుగయిన రోడ్డు సౌకర్యాలు ఉండాలన్న దృష్టితో ముసాయిదాలో ఈ ప్రతిపాదనలు పెట్టినట్టు తెలుస్తోంది. ఆదిలాబాద్ నుంచి వాడరేవుకు కొత్తగా ప్రతిపాదించిన రహదారి జిల్లా మీదుగా వెళ్తుంది. ఆదిలాబాద్, ఉట్నూరు, ఖానాపూర్ నుంచి జిల్లాలోని కోరుట్ల, వేములవాడ మీదుగా ఈ రహదారి వెళ్తుంది. అక్కడ నుంచి సిద్దిపేట, జనగాం, సూర్యపేట, మిర్యాలగూడ మీదుగా ప్రకాశం జిల్లాకి ప్రవేశిస్తుంది. జగిత్యాల నుంచి మరో రహదారి కరీంనగర్, వరంగల్ మీదుగా ఖమ్మం, కోదాడ వరకు వెళ్తుంది. ఈ రెండు రహదారులను ముసాయిదాలో కేంద్ర మంత్రివర్గం చేర్చింది. ఈ రెండు రోడ్లను విస్తరించినట్లయితే జిల్లాలో రవాణావ్యవస్థ మెరుగుపడుతుంది. అంతరాష్ట్ర రహదారిగా అభివృద్ది చెందితే వాణిజ్యరంగంలో కూడా ప్రగతి సాధ్యమవుతుంది. వీటితోపాటు రెండోదశలో మావోయస్టు ప్రభావిత ప్రాంతాల్లో రహదారుల విస్తరణపై దృష్టి సారించాలని కేంద్రం భావిస్తోంది. -
కుట్రలపై కన్నెర్ర.. చంద్రబాబు, కిరణ్ దిష్టిబొమ్మల దహనం
సాక్షి, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిపై తెలంగాణవాదులు భగ్గుమన్నారు. సోమవారం కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్‌లో టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు బాల్క సుమన్, జిల్లా అధ్యక్షుడు వేణు ఆధ్వర్యంలో నారా, నల్లారిల దిష్టిబొమ్మలను దహనం చేశారు. సీమాంధ్ర నేతలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవాలని కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్రాన్ని సాధించుకుంటామని ధీమా వ్యక్తంచేశారు. సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ వరంగల్ జిల్లా కోర్టు న్యాయవాదులు విధులు బహిష్కరించారు. అనంతరం సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు. రాష్ట్రాన్ని విభజిస్తే సమస్యలు వస్తాయంటూ ముఖ్యమంత్రి విషప్రచారం చేస్తున్నారని, దానిని తిప్పికొట్టాలని రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు సహోదర్‌రెడ్డి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అంబరీషరావు, ఉపాధ్యక్షుడు గునిగంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా విద్యుత్ ఉద్యోగుల ఆధ్వర్యంలో సీఎం, సీమాంధ్ర నాయకుల దిష్టిబొమ్మను పాడెకు కట్టి శవయాత్ర నిర్వహించారు. అనంతరం ములుగురోడ్ జంక్షన్లో దహనం చేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని తెలంగాణచౌక్‌లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, సీమాంధ్ర నాయకుల ఫ్లెక్సీలను దహనం చేశారు. సీమాంధ్ర నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జన్నారం మండల కేంద్రంలో టీజీవీపీ, ఏబీవీపీ అధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మకు శవయాత్ర చేసి తెలంగాణ విగ్రహం సమీపంలో దహనం చేశారు. సీఎం కన్పించడం లేదంటూ ఫిర్యాదు సీడబ్ల్యూసీ తెలంగాణ ఏర్పాటుపై ప్రకటన చేసిన నాటినుంచి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మతిస్థిమితం తప్పి కన్పించకుండా పోయాడని అతని ఆచూకీ చెప్పాలంటూ టీఆర్ఎస్ నాయకులు నిజామాబాద్ ఒకటో పోలీస్‌స్టేషన్‌లో సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ జిల్లా ప్రధానకార్యదర్శి యెండల సుజీత్ మాట్లాడుతూ గత నెల 30న ఢిల్లీ నుంచి తిరిగివచ్చిన నాటినుంచి ముఖ్యమంత్రికి మతిస్థిమితం కోల్పోయాడన్నారు. తెలంగాణ ఏర్పాటుకు, ఇక్కడి ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని విమర్శించారు.