టీ-ముసాయిదా బిల్లు రాగానే కేంద్రం పొందుపరిచే అవకాశం
సాక్షి, హైదరాబాద్: రాష్ర్ట విభజన నేపథ్యంలో తెలంగాణ ప్రాంతంలో శాసనసభా స్థానాల పెంపు ప్రతిపాదనను కేం ద్రం తీవ్రంగా పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర అసెంబ్లీ నుంచి విభజన బిల్లు వచ్చిన వెంటనే ఈ ప్రతిపాదనను పొందుపరిచి కేబినెట్ ముందుకు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. పార్లమెంటు ముందుకు విభజన బిల్లు వచ్చినప్పుడు అందులో ఈ అంశం కచ్చితంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు కొందరు తెలంగాణ నేతలకు దిగ్విజయ్‌సింగ్ హామీ కూడా ఇచ్చినట్లు సమాచారం.
ఈ ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చిన జాతీయ విపత్తుల నివారణా సంస్థ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్‌రెడ్డి ఆదివారం అందుబాటులో ఉన్న తెలంగాణ డీసీసీ అధ్యక్షులు, సీనియర్ నేతలతో సమావేశమై ఇదే అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా శశిధర్‌రెడ్డి తన ప్రతిపాదనపట్ల కేంద్ర ప్రభుత్వ పెద్దల ఆలోచనను వారికి వివరించారు. అసెంబ్లీ నుంచి విభజన బిల్లు కేంద్రానికి వెళ్లిన సమయంలో కేంద్ర హోంమంత్రి షిండే, జీవోఎం సభ్యుడు జైరాం రమేశ్‌తోపాటు మరికొందరు కేంద్ర పెద్దలను కలిసి ఈ ప్రతిపాదనపై మరోసారి చర్చించనున్నట్లు తెలిపారు.
సీట్ల పెంపు ఖాయం!
Published Mon, Dec 30 2013 3:13 AM | Last Updated on Mon, Jun 18 2018 8:10 PM
Advertisement
Advertisement