కూతురి కిరాతకం | Daughter kills mother in bangalore | Sakshi
Sakshi News home page

కూతురి కిరాతకం

Published Sun, Feb 23 2014 1:15 PM | Last Updated on Sat, Sep 2 2017 3:59 AM

కూతురి కిరాతకం

కూతురి కిరాతకం

చెడుదారిలో వెళ్తున్న కన్న కూతురుని మందలించిన పాపానికి ఆ తల్లి దారుణ హత్యకు గురైన సంఘటన శుక్రవారం సాయంత్రం నగర శివార్లలోని తావరకెరె పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

  • ప్రియుడితో కలిసి  తల్లిని హత్య చేసిన వైనం
  • వివాహేతర సంబంధం వద్దని మందలించినందుకు దారుణం
  •  బెంగళూరు, న్యూస్‌లైన్ : చెడుదారిలో వెళ్తున్న కన్న కూతురుని మందలించిన పాపానికి ఆ తల్లి దారుణ హత్యకు గురైన సంఘటన శుక్రవారం సాయంత్రం నగర శివార్లలోని తావరకెరె పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నగర శివార్లలోని బ్యాడరహళ్లిలోని కెంపేగౌడ నగరలో నివాసం ఉంటున్న గంగాంబిక (47) హత్యకు గురైంది. ఆమె కుమార్తె చైత్ర, ప్రియుడు శ్రీధర్‌ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని శనివారం తావ రకెరె పోలీసులు తెలిపారు.

    వివ రాలు... మాగడి తాలుకా సాతనూరు గ్రామ పంచాయతీలోని కోండహ ళ్లికి చెందిన గంగరాజప్ప, గంగాంబిక దంపతులు శ్రీమంతులు. వీరి ఒక్కగానొక్క కుమార్తె చైత్ర, కుమార్తెను అల్లారుముద్దుగా పెంచుకున్నారు. ఐదేళ్ల క్రితం జగదీష్ అనే వ్యక్తితో చైత్ర వివాహం జరిపించారు. వీరికి భవాని (4) అనే కుమార్తె ఉంది. కుటుంబ సమస్యల కారణంగా చైత్ర ఎనిమిది నెలలుగా పుట్టింటిలో ఉంటోంది.

    విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో చైత్ర ఓ కారు డ్రైవర్‌తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. తరచూ శ్రీధర్ చైత్ర ఇంటికి వచ్చి వెళ్లేవాడు. ఈ విషయం చుట్టుపక్కల మహిళల ద్వారా తల్లి గంగాంబిక చెవిన పడింది. దీంతో ఆమె చైత్రను తీవ్రంగా హెచ్చరించింది. అయినా చైత్ర ప్రవర్తనలో మార్పు రాలేదు. ఇదిలా ఉంటే శుక్రవారం సాయంత్రం శ్రీధర్ చైత్ర ఇంటికి వెళ్లాడు. ఇద్దరు ఇంటిలో ఉన్న సమయంలో గంగాంబిక గొడవ చేసింది.

    బయటకు వెళ్లమని శ్రీధర్‌ను హెచ్చరించింది. ఆ సమయంలో శ్రీధర్‌ను వెనుకేసుకొస్తూ చైత్ర తల్లితో వాగ్వాదానికి దిగింది. ఇదే సమయంలో తీవ్ర ఆవేశంలో ఉన్న శ్రీధర్, చైత్రలు కలిసి గంగాంబిక గొంతు నులిమి హత్య చేశారు. ఆమె మరణించడంతో వారు అక్కడి నుంచి జారుకోడానికి యత్నించారు. అయితే గొడవ జరుగుతున్న విషయం తెలుసుకున్న స్థానికులు పారిపోతున్న చైత్ర, శ్రీధర్‌ను వెంటాడి పట్టుకుని పోలీసులకు అప్పగించారు.  
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement