చిలకలగూడ గొల్లపుల్లయ్యబావి కాలనీలోని ఓ ఇంట్లో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చోరీ జరిగింది. దుండగులు ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. సుమారు 40 తులాల బంగారం, రూ.80 వేల నగదు దొంగలు ఎత్తుకెళ్లినట్లు బాధితుడు శ్రీధర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సంఘటనాస్థలానికి క్లూస్‌టీం రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.