
పోస్టర్ రహిత నగరంగా తీర్చిదిద్దుదాం
భవానీపురం : విజయవాడను వాల్‌పోస్టర్స్ రహిత నగరంగా తీర్చిదిద్దుదామని నగర మేయర్ కోనేరు శ్రీధర్ పిలుపునిచ్చారు. నలంద కళాశాల విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి ఆయన గురువారం తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి లోబ్రిడ్జి వరకు ఇరువైపులా గోడలకు ఉన్న పోస్టర్లను తొలగించి పెయింటింగ్స్ వేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. మేయర్ మాట్లాడుతూ పుష్కరాల సందర్భంగా నగరానికి వచ్చే యాత్రీకులకు కనువిందుగా, అహ్లాదభరితంగా ఉండే చిత్రాలను గీయాలని సూచించారు. పెయింటింగ్ వేస్తున్న విద్యార్థులను ఆయన అభినందించారు.