రంజిత్ అజేయ సెంచరీ | ranjith hits century | Sakshi
Sakshi News home page

రంజిత్ అజేయ సెంచరీ

Published Thu, Dec 26 2013 12:00 AM | Last Updated on Sat, Sep 2 2017 1:57 AM

ranjith hits century

జింఖానా, న్యూస్‌లైన్: రోహిత్ ఎలెవన్ బ్యాట్స్‌మన్ రంజిత్ (110 నాటౌట్) సెంచరీతో అజేయంగా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. హెచ్‌సీఏ కిషన్ ప్రసాద్ వన్డే నాకౌట్ టోర్నీలో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో రోహిత్ ఎలెవన్ జట్టు నాలుగు వికెట్ల తేడాతో ఎంఎల్ జయసింహ జట్టుపై విజయం సాధించింది.
 
  తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఎంఎల్ జయసింహ 191 పరుగులకు ఆలౌటైంది. నీరజ్ (57) అర్ధ సెంచరీతో రాణించగా... రాఘవేంద్ర (40) మెరుగ్గా ఆడాడు. రోహిత్ ఎలెవన్ బౌలర్ ప్రతాప్, రోహిత్ చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. అనంతరం బరిలోకి దిగిన రోహిత్ ఎలెవన్ 6 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. ఎంఎల్ జయసింహ బౌలర్ రాకేష్ 4 వికెట్లు చేజిక్కించుకున్నాడు.
 
  మరో మ్యాచ్‌లో బౌలర్ అశోక్ (6/46) విజృంభించడంతో భారతీయ సీసీ జట్టు రెండు పరుగుల తేడాతో సఫిల్‌గూడ జట్టుపై గెలుపొందింది. మొదట భారతీయ సీసీ 3 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. సోమశేఖర్ (95 నాటౌట్), రాఘవేంద్ర (62) అర్ధ సెంచరీలతో చెలరేగారు. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన సఫిల్‌గూడ 180 పరుగులకు కుప్పకూలింది. నాగరాజ్ గౌడ్ 33 పరుగులు చేశాడు.
 
 ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
  విక్టరీ: 297/7 (అశిష్ 71, రజనీకాంత్ 68, ప్రకాష్ 42, మల్లికార్జున్ 36); నోబుల్: 142/8 (అనుదీప్ 54; రజనీకాంత్ 3/23).
 
  సాగర్ ఎలెవన్: 133 ( హిమాన్షు 41, రోహన్ బాబు 5/10); గౌలిపురా: 136/7 (శ్రీహరి 3/44).
 
  వాకర్‌టౌన్: 173/9 (రమేష్ 34; సూర్య 3/41); కల్నల్ అక్రిలిక్: 174/6 (నావీద్ 54; న ర్సింహ 3/27).
 
  నటరాజ్: 169 (మధు గౌడ్ 46, మణికుమార్ 31; మిత్ర 4/36); అక్షిత్ సీసీ: 141 (చరణ్ 32; మణికుమార్ 6/40).
 
  హెచ్‌జీసీ: 206/5 (సాయికుమార్ 56, ప్రసాద్ 62, చరణ్ 31); యూత్ సీసీ: 102 (జైషీల్        
    30; శ్రవణ్ నాయుడు 3/19).
 
   వీఎస్‌టీ: 105 (అరవింద్ 3/23); ఏబీ కాలనీ: 102/2 (అరవింద్ 43, సతీష్ 41 నాటౌట్).
  టైమ్స్: 68 (ఆదిల్‌బిన్ మూసా 5/8); ఎంసీహెచ్: 69/3.
 
 అద్భుతం సాధ్యమా!
 మొత్తం 9 జట్లు ఉన్న గ్రూప్ ‘సి’లో హైదరాబాద్ 18 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. 7 మ్యాచుల్లో జట్టు ఒకటి గెలిచి, 6 డ్రా చేసుకుంది. పట్టికలో అగ్రస్థానంలో ఉన్న మహారాష్ట్ర (29) ఇప్పటికే క్వార్టర్స్ చేరింది. పాయింట్ల పరంగా ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ (25), హిమాచల్ ప్రదేశ్ (24)లతో హైదరాబాద్ పోటీ పడాల్సి ఉంది. చివరి మ్యాచ్‌లో జట్టు కేరళతో సొంతగడ్డపై తలపడాల్సి ఉంది. ఆ మ్యాచ్‌లో బోనస్ పాయింట్ గెలిస్తే (!)  మొత్తం 25 పాయింట్లకు చేరుకుంటుంది.
 
  అదే సమయంలో కాశ్మీర్, త్రిపురతో జరిగే ఆఖరి మ్యాచ్‌లో ఖచ్చితంగా ఓడిపోవాలి. డ్రా ద్వారా ఒక్క పాయింట్ దక్కించుకున్నా హైదరాబాద్ అవకాశం పోయినట్లే. ఇదీ జరిగి రెండు జట్లూ సమమైతే ‘రన్ కోషెంట్’ (ఒక్కో వికెట్‌కు చేసిన, ఇచ్చిన పరుగుల ఆధారంగా)ను బట్టి ముందుకు వెళ్లేది ఎవరో నిర్ణయిస్తారు. హైదరాబాద్ క్వార్టర్ ఫైనల్‌తో పాటు పై గ్రూప్‌కు చేరాలన్నా ఇక అద్భుతం జరగాల్సిందే!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement