జింఖానా, న్యూస్‌లైన్: మెడికల్ కళాశాలల క్రీడోత్సవాల్లో భాగంగా జరిగిన బాస్కెట్‌బాల్ ఫైనల్స్‌లో ఆతిథ్య అపోలో విజయం సాధించింది. జూబ్లీహిల్స్‌లోని అపోలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ అండ్ రీసెర్చ్ (ఏఐఎంఎస్‌ఆర్)లో జరిగిన బాలికల విభాగం ఫైనల్స్‌లో అపోలో జట్టు 27-8తో కామినేని జట్టుపై విజయం సాధించింది.
బాలుర ఫుట్‌బాల్ ఫైనల్స్‌లో డెక్కన్ 3-1తో అపోలోపై నెగ్గి టైటిల్ కైవసం చేసుకుంది. వాలీబాల్ ఫైనల్స్‌లో కామినేని జట్టు 2-0తో అపోలోపై గెలుపు కైవసం చేసుకుంది. క్రికెట్ మ్యాచ్ ఫైనల్స్‌లో భాస్కర జట్టు 3 పరుగుల తేడాతో గాంధీ మెడికల్ కళాశాల జట్టుపై నెగ్గింది. తొలుత బరిలోకి దిగిన భాస్కర 148 పరుగులు చేయగా... అనంతరం గాంధీ కళాశాల 145 పరుగులు మాత్రమే చేయగలిగింది.
బాస్కెట్‌బాల్ విజేత అపోలో
Published Fri, Dec 20 2013 12:06 AM | Last Updated on Sat, Sep 2 2017 1:46 AM
Advertisement
Advertisement