రాజు అదుర్స్ | raju took five wickets | Sakshi
Sakshi News home page

రాజు అదుర్స్

Published Fri, Dec 20 2013 12:16 AM | Last Updated on Sat, Sep 2 2017 1:46 AM

raju took five wickets

జింఖానా, న్యూస్‌లైన్: ఎన్‌ఎఫ్‌సీ బౌలర్ ఎంవీఎన్ రాజు 5 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి జట్టును కట్టడి చేశాడు. దీంతో ఎ-ఇన్‌స్టిట్యూషన్ వన్డే లీగ్‌లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో ఎన్‌ఎఫ్‌సీ జట్టు 105 పరుగుల తేడాతో ఐఐసీటీ జట్టుపై గెలుపొందింది. మొదట ఎన్‌ఎఫ్‌సీ జట్టు 8 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. రాజు (64), నర్సిహారావు (55) అర్ధ సెంచరీలతో రాణించగా... ఏఎన్ నాయుడు 32 పరుగులు చేశాడు. ఐఐసీటీ బౌలర్లు అమర్ 3, చందు 4 వికెట్లు తీసుకున్నారు. తర్వాత బరిలోకి దిగిన ఐఐసీటీ 129 పరుగులకే చేతులెత్తేసింది. సందీప్ (48), అరుణ్ (35) ఫర్వాలేదనిపించారు. ఎన్‌ఎఫ్‌సీ బౌలర్లు వాహిద్ 3 వికెట్ల తీశాడు.
 
 ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
  ఏపీ హైకోర్ట్: 86 (డేనియల్ 5/20); బీహెచ్‌ఈఎల్: 87/2 (రాజిద్ 35 నాటౌట్).
  ఐఏఎఫ్: 138 (రెహమాన్ 31, మంగారావు 4/31); ఏపీఎస్‌ఈబీ: 116 (మెహతా 5/15).
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement