జింఖానా, న్యూస్‌లైన్: అఖిల భారత బీఎస్‌ఎన్‌ఎల్ వెయిట్‌లిఫ్టింగ్, పవర్‌లిఫ్టింగ్ బెస్ట్ ఫిజిక్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌కు చెందిన ఎస్‌వీ నారాయణ స్వర్ణ పతకాన్ని సాధించాడు. మధ్యప్రదేశ్ సర్కిల్ స్పోర్ట్స్, కల్చరల్ బోర్డు ఆధ్వర్యంలో ఈ పోటీలు భోపాల్‌లో జరిగాయి.
85 కేజీల విభాగంలో నారాయణ విజేతగా నిలిచాడు. మధ్యప్రదేశ్ బీఎస్‌ఎన్‌ఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎన్‌కే యాదవ్ చేతుల మీదుగా నారాయణ బంగారు పతకం, ప్రశంసా పత్రాన్ని అందుకున్నాడు. గౌలీగూడాలోని బీఎస్‌ఎన్‌ఎల్ సెంట్రల్ కార్యాలయంలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న అతను ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో 13 పతకాలను సాధించినట్లు తెలిపాడు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధిస్తానని ధీమా వ్యక్తం చేశాడు.
నారాయణకు స్వర్ణం
Published Sat, Jan 4 2014 12:12 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement