అబ్దుల్ అజీమ్ 8/8 | Abdul Azim took eight wickets | Sakshi
Sakshi News home page

అబ్దుల్ అజీమ్ 8/8

Published Mon, Dec 30 2013 12:45 AM | Last Updated on Sat, Sep 2 2017 2:05 AM

Abdul Azim took eight wickets

జింఖానా, న్యూస్‌లైన్: అపెక్స్ సీసీ జట్టు బౌలర్ అబ్దుల్ అజీమ్ (8/8) తన బౌలింగ్‌తో రుషిరాజ్ జట్టు బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించాడు. దీంతో ఆ జట్టు 106 పరుగుల తేడాతో రుషిరాజ్ జట్టుపై విజయం సాధించింది. ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన అపెక్స్ సీసీ 7 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. సయ్యద్ జావిద్ అలీ (67), సయ్యద్ పాషా అలీ (60) అర్ధ సెంచరీలతో రాణించారు. రుషిరాజ్ బౌలర్ మహ్మద్ అలీమ్ 3 వికెట్లు తీసుకున్నాడు. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన రుషిరాజ్... అజీమ్ ధాటికి 104 పరుగులకే కుప్పకూలింది. మల్లికార్జున్ (45) మినహా మిగిలినవారు రాణించలేకపోయారు. మరో మ్యాచ్‌లో గ్రీన్‌ల్యాండ్స్ జట్టు బ్యాట్స్‌మన్ సుందర్ (106 నాటౌట్) సెంచరీతో అజేయంగా నిలవడంతో ఆ జట్టు 5 వికెట్ల తేడాతో యంగ్ సిటిజన్ జట్టుపై గెలుపు దక్కించుకుంది.
 
 మొదట బరిలోకి దిగిన యంగ్ సిటిజన్ 7 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. వికాస్ (103) సెంచరీతో చెలరేగగా... రతన్ (54 నాటౌట్) అర్ధ సెంచరీతో అజేయంగా నిలిచాడు. గ్రీన్‌ల్యాండ్స్ బౌలర్ శ్రీచరణ్ 4 వికెట్లు తీసుకున్నాడు. అనంతరం బరిలోకి దిగిన గ్రీన్‌ల్యాండ్స్ 5 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. యంగ్ సిటిజన్ బౌలర్ కరణ్ 5 వికె ట్లు పడగొట్టాడు.
 
 ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
 సత్యం సీసీ: 189/8 (నరేష్ 35; శ్రీనివాస్ 4/45); కాంకార్డ్: 132 (శ్రీనివాస్ 45, అక్బర్ 43; విశ్వనాథ్ 5/16).
 
  అభినవ్ కోల్ట్స్: 179 (అషీర్ 37; సతీష్ 4/46); ఎంపీ బ్లూస్: 183/5 (శ్రీనివాస్ 40, సతీష్ 40 నాటౌట్).
 
  పీఎన్ యంగ్‌స్టర్స్: 146/7 (సులేమాన్ 4/33); మహావీర్: 147/7 (రాజ్‌కిరణ్ 34, విజేందర్ 52).
 
  విక్టర్: 136 (శ్రవణ్ 3/40); రోహిత్ ఎలెవన్: 139/5 (సాయిరామ్ 35, రణ్‌జీత్ 51 నాటౌట్; భాను కుమార్ 5/40).
 
 ఎంపీ యంగ్‌మెన్స్: 130 (విజయ్ 3/15); పీకేసీసీ: 93 (నితిన్ 4/40, ఉదయ్ 3/15).
 సెయింట్ మేరీస్: 70 (తరుణ్ 3/40); యూత్ సీసీ: 71/1 (అరుణ్ 39).
 
  కల్నల్ అక్రిలిక్: 85 (బషీర్ 6/44); షాలిమార్: 89/5 (అల్తాఫ్ 3/10).
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement