జింఖానా, న్యూస్‌లైన్: ఐఎంజీ- రిలయన్స్ బాస్కెట్‌బాల్ కాలేజి లీగ్‌లో లయోలా అకాడమీకి చెందిన పురుషుల, మహిళల జట్లు విజయాలు నమోదు చేశాయి. సికింద్రాబాద్ క్లబ్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో ఆదివారం పురుషుల విభాగంలో లయోలా అకాడమీ జట్టు 48-18తో మల్లారెడ్డి కాలేజి జట్టుపై గెలుపొందింది.
మ్యాచ్ తొలి అర్ధ భాగం ముగిసే సమయానికి 30-16తో లయోలా అకాడమీ ఆధిక్యంలో ఉంది. రెండో అర్ధ భాగంలో మల్లారెడ్డి జట్టు ఆటగాళ్లు శ్రీకర్ (7 పాయింట్లు), సురభ్ (6) చెమటోడ్చినప్పటికీ విజయం చేకూరలేదు. లయోలా అకాడమీ ఆటగాళ్లు నవీన్ (15), ఉదయ్ (10) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. మరో వైపు మహిళల విభాగంలో లయోలా అకాడమీ 64-40తో కస్తూర్బా కాలేజి జట్టుపై గెలిచింది.
ఆట ప్రారంభం నుంచి లయోలా అకాడమీ క్రీడాకారిణులు రమా మిశ్రా (25), మౌనిక (10), అక్షిత (10) దూకుడుగా ఆడారు. ప్రత్యర్థికి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా చాలా నేర్పుగా ఆటను కొనసాగించారు. మ్యాచ్ ప్రథమార్ధం ముగిసే సమయానికి లయోలా అకాడమీ 35-13తో ఆధిక్యంలో ఉంది. అనంతరం విజృంభించిన కస్తూర్బా క్రీడాకారిణులు శ్వేత (16), కోమల్ (14), వరలక్ష్మి (10) రెండో అర్ధ భాగంలో చక్కని పోరాటపటిమ కనబరిచినా చివరకు విజయం మాత్రం దక్కలేదు.
ఇతర ఫలితాలు
సీవీఎస్‌ఆర్: 39 (ప్రత్యూష 21, శ్వేత 12); గోకరాజు: 27 (మృణాళిని 19, సింధూష 6).
నారాయణమ్మ: 2 (అలేఖ్య 12, లక్ష్మి 6); సెయింట్ మార్టిన్స్: 32 (ఐశ్వర్య 8).
పురుషుల విభాగం: సీవీఎస్‌ఆర్: 53 (మహేష్ 16, కృష్ణ 15, వివేక్ 9); బిట్స్‌పిలాని: 41 (ఇషాన్ 17, స్వార్ణిమ్ 10).
ఏవీ కాలేజి: 44 (సాయి 14, బాలాజి 11, కిరణ్ 11); అవంతి డిగ్రీ కాలేజి: 38 (జశ్వంత్ 26, అక్రమ్ 10).
ముఫకంజా: 62 (నవాజ్ 25, సాదుద్దీన్ 18, షరీఫుద్దీన్ 15); నిజాం డిగ్రీ కాలేజి: 39 (రోహిత్ 19, నందు 10).
దూసుకెళ్తున్న లయోలా జట్లు
Published Mon, Jan 27 2014 1:07 AM | Last Updated on Sat, Sep 2 2017 3:02 AM
Advertisement
Advertisement