చెలరేగిన మమత | mamatha sucessful | Sakshi
Sakshi News home page

చెలరేగిన మమత

Published Fri, Feb 7 2014 12:21 AM | Last Updated on Wed, Sep 19 2018 6:31 PM

mamatha sucessful

జింఖానా, న్యూస్‌లైన్: బ్యాట్స్‌వుమన్ మమత (73) అర్ధ సెంచరీ సహాయంతో హైదరాబాద్ జట్టు 13 పరుగుల తేడాతో ఒడిశా జట్టుపై గెలుపొందింది. అఖిల భారత సీనియర్ మహిళల టి20 ఎలైట్ ‘ఎ’ గ్రూప్ ‘ఎ’లో భాగంగా గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా  హైదరాబాద్ 7 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. సింధుజా రెడ్డి (27) రాణించింది. స్వాగతిక రెండు వికెట్లు తీసుకుంది. అనంతరం బరిలోకి దిగిన ఒడిశా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 114 పరుగులు మాత్రమే చేయగలిగింది. స్వాగతిక (32), మెహతా (22), మొహంతి (19), కాదంబిని (27) చక్కటి ఆట తీరును కనబరిచారు. ఈ విజయంతో హైదరాబాద్ 4 పాయింట్లను సొంతం చేసుకుంది.
 

 మహారాష్ట్రపై రైల్వేస్ విజయం
మరో మ్యాచ్‌లో రైల్వేస్ జట్టు 4 వికెట్ల తేడాతో మహారాష్ట్ర జట్టుపై గెలుపొందింది. ఏఓసీ సెంటర్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బరిలోకి దిగిన మహారాష్ట్ర 9 వికెట్ల నష్టానికి 60 పరుగులు చేసింది. ఎస్‌పీ జాదవ్ 18 పరుగులు చేసింది. రైల్వేస్ బౌలర్ కేడీ పాటిల్ మూడు వికెట్లు పడగొట్టింది. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన రైల్వేస్ 6 వికెట్లు కోల్పోయి 61 పరుగులు చేసి నెగ్గింది. మహారాష్ట్ర బౌలర్ శ్వేత మానె 2 వికెట్లు తీసుకుంది. రైల్వేస్ 4 పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement