జింఖానా, న్యూస్‌లైన్: జతిన్ (5/28), సత్యనారాయణ (5/44) బౌలింగ్‌లో చెలరేగడంతో ఇండియన్ ఎయిర్‌లైన్స్ జట్టు 53 పరుగుల తేడాతో హైదరాబాద్ ఇండస్ట్రీస్ జట్టుపై గెలిచింది. ఎ-ఇనిస్టిట్యూషన్ వన్డే లీగ్‌లో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో... మొదట బరిలోకి దిగిన ఇండియన్ ఎయిర్‌లైన్ 133 పరుగులు చేసింది. దీపక్ 34 పరుగులు చేశాడు. హైదరాబాద్ ఇండస్ట్రీస్ బౌలర్ నికోలస్ 6 వికెట్లు తీశాడు. తర్వాత బరిలోకి దిగిన హైదరాబాద్ ఇండస్ట్రీస్ 80 పరుగులకే ఆలౌటైంది.
ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
కమర్షియల్ ట్యాక్స్: 174/8 (హరినాథ్ 47, మహ్మద్ 50; అస్ఫరుల్ 3/23); సీసీఎంబీ: 176/3 (సంతోష్ 36, నాగభూషణ్ 35).
ఏపీఎస్‌ఆర్‌టీసీ: 168 (ప్రసాద్ 63; ఎస్ రెడ్డి 3/59); ఐఐసీటీ: 169/7 (శ్రీనివాస్ 44, అరుణ్ 78 నాటౌట్).
ఎన్‌ఎఫ్‌సీ: 118 (నరసింహా రావు 36; సాగర్ 3/28, సురేష్ 3/48); పోస్టల్: 122/1 (సిద్ధార్థ్ 31 నాటౌట్, విజయ్ 70).
వీసీటీ: 113/8 ( మధువన్ 40); మిధాని: 115/5 (అనిల్ 43).
అదరగొట్టిన జతిన్, సత్యనారాయణ
Published Sun, Dec 22 2013 11:37 PM | Last Updated on Fri, Sep 7 2018 4:33 PM
Advertisement
Advertisement