జింఖానా, న్యూస్‌లైన్: మయూర సీసీ బౌలర్ కమల్ కుమార్ (7/35) ప్రత్యర్థి జట్టుకు ముచ్చెమటలు పట్టించాడు. దీంతో ఆ జట్టు 7 వికెట్ల తేడాతో హెచ్‌జీసీ జట్టుపై విజయం సాధించింది. ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హెచ్‌జీసీ 93 పరుగులకే కుప్పకూలింది.
అనంతరం బరిలోకి దిగిన మయూర సీసీ 3 వికెట్లు కోల్పోయి 97 పరుగులు చేసి నెగ్గింది. కమల్ కుమార్ (31 నాటౌట్), సంజయ్ సింగ్ (30 నాటౌట్) మెరుగ్గా ఆడారు. మరో మ్యాచ్‌లో విజయ్ సీసీ బౌలర్ దీపాంకర్ 7 వికెట్లు పడగొట్టడంతో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో మహావీర్ సీసీ జట్టుపై గెలుపొందింది. మొదట బరిలోకి దిగిన మహావీర్ సీసీ 140 పరుగులకు ఆలౌటైంది. సుధాకర్ 30 పరుగులు చేశాడు. తర్వాత విజయ్ సీసీ 4 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసి గెలిచింది. నాగరాజ్ (39), శివ (36 నాటౌట్) ఫర్వాలేదనిపించారు.
ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
రోషనార: 216 (రాహుల్ 36, వేణు 41; నిరూప్ 6/60); గ్రీన్ టర్ఫ్: 181/7 (ఫరాన్ 37, సుధీర్ 38; నయన్ 4/50).
అపెక్స్ సీసీ: 216/9 (అన్వర్ అలీ 41, అబ్దుల్ అజీమ్ 41; యూసఫ్ 5/58, జగదీశ్ 3/35); ఆడమ్స్ ఎలెవన్: 94 (హషమ్ అలీ 7/39).
రోహిత్ ఎలెవన్: 218/9 ( సాయి రామ్ 35, రంజిత్ 55; ప్రఫుల్ కుమార్ 4/72); ఎస్ రేమాండ్స్: 174 (సుధీర్ 43; రంజిత్ 4/22).
ఏబీ కాలనీ: 126 (అరవింద్ 47, సతీష్ 36, ప్రతీక్ 4/24); వీపీవీఎం: 130/6 (విజయ్ 47, షాకీర్ 45, సతీష్ 3/21).
సెయింట్ ప్యాట్రిక్స్: 102 (కృష్ణ సాయి 5/23); సీకే బ్లూస్: 104/3 (వరుణ్ 39, విష్ణు నాయక్ 36; అభిలాష్ 3/35).
స్పోర్టివ్: 170 (రాము 40; విక్రమ్ 3/45, అంబాదాస్ 4/36); తారకరామ: 172/5 (శివ కుమార్ 70).
స్టార్లెట్స్: 112 (శివ కోటి రెడ్డి 3/30, సావర్ బోరంచ 3/21); టైమ్ సీసీ: 115/2 (సావన్ బోరంచ 40 నాటౌట్, శివ కోటి రెడ్డి 40 నాటౌట్).
కమల్‌కు ఏడు వికెట్లు
Published Sun, Dec 22 2013 11:34 PM | Last Updated on Sat, Sep 2 2017 1:51 AM
Advertisement
Advertisement