kamal kumar
-
డాలర్‌పై మోజు!
‘‘ప్రస్తుత తరంలో డాలర్లపై మోజుపడే వారి శాతమే ఎక్కువ. డాలర్ల కోసం అమెరికా వెళ్లిపోయి, సొంత గడ్డను కూడా మర్చిపోతున్నారు. ఈ కోవకు చెందినవారి జీవితం ఆధారంగా ‘డాలర్‌కి మరోవైపు’ చిత్రం తీశాం’’ అని నిర్మాత సత్యం అన్నారు. యశ్వంత్, మిత్ర జంటగా పూసల దర్శకత్వంలో బేబి శ్రీక్రితి సమర్పణలో రూపొందిన ఈ చిత్రానికి కమల్‌కుమార్ పాటలు స్వరపరిచారు. ఈ పాటల సీడీని ‘మా’ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ ఆవిష్కరించారు. ‘‘ప్రస్తుతం సినిమా పరిశ్రమలో చిన్న చేపను పెద్ద చేపలు మింగేస్తున్నాయనీ, అలా కాకుండా సినీ పెద్దలు ఇలాంటి చిన్న చిత్రాలను ప్రోత్సహించాలి’’ అని ఏపీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ చెప్పారు. -
కమల్‌కు ఏడు వికెట్లు
జింఖానా, న్యూస్‌లైన్: మయూర సీసీ బౌలర్ కమల్ కుమార్ (7/35) ప్రత్యర్థి జట్టుకు ముచ్చెమటలు పట్టించాడు. దీంతో ఆ జట్టు 7 వికెట్ల తేడాతో హెచ్‌జీసీ జట్టుపై విజయం సాధించింది. ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హెచ్‌జీసీ 93 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బరిలోకి దిగిన మయూర సీసీ 3 వికెట్లు కోల్పోయి 97 పరుగులు చేసి నెగ్గింది. కమల్ కుమార్ (31 నాటౌట్), సంజయ్ సింగ్ (30 నాటౌట్) మెరుగ్గా ఆడారు. మరో మ్యాచ్‌లో విజయ్ సీసీ బౌలర్ దీపాంకర్ 7 వికెట్లు పడగొట్టడంతో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో మహావీర్ సీసీ జట్టుపై గెలుపొందింది. మొదట బరిలోకి దిగిన మహావీర్ సీసీ 140 పరుగులకు ఆలౌటైంది. సుధాకర్ 30 పరుగులు చేశాడు. తర్వాత విజయ్ సీసీ 4 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసి గెలిచింది. నాగరాజ్ (39), శివ (36 నాటౌట్) ఫర్వాలేదనిపించారు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు రోషనార: 216 (రాహుల్ 36, వేణు 41; నిరూప్ 6/60); గ్రీన్ టర్ఫ్: 181/7 (ఫరాన్ 37, సుధీర్ 38; నయన్ 4/50). అపెక్స్ సీసీ: 216/9 (అన్వర్ అలీ 41, అబ్దుల్ అజీమ్ 41; యూసఫ్ 5/58, జగదీశ్ 3/35); ఆడమ్స్ ఎలెవన్: 94 (హషమ్ అలీ 7/39). రోహిత్ ఎలెవన్: 218/9 ( సాయి రామ్ 35, రంజిత్ 55; ప్రఫుల్ కుమార్ 4/72); ఎస్ రేమాండ్స్: 174 (సుధీర్ 43; రంజిత్ 4/22). ఏబీ కాలనీ: 126 (అరవింద్ 47, సతీష్ 36, ప్రతీక్ 4/24); వీపీవీఎం: 130/6 (విజయ్ 47, షాకీర్ 45, సతీష్ 3/21). సెయింట్ ప్యాట్రిక్స్: 102 (కృష్ణ సాయి 5/23); సీకే బ్లూస్: 104/3 (వరుణ్ 39, విష్ణు నాయక్ 36; అభిలాష్ 3/35). స్పోర్టివ్: 170 (రాము 40; విక్రమ్ 3/45, అంబాదాస్ 4/36); తారకరామ: 172/5 (శివ కుమార్ 70). స్టార్లెట్స్: 112 (శివ కోటి రెడ్డి 3/30, సావర్ బోరంచ 3/21); టైమ్ సీసీ: 115/2 (సావన్ బోరంచ 40 నాటౌట్, శివ కోటి రెడ్డి 40 నాటౌట్). -
కమల్ విజృంభణ
జింఖానా, న్యూస్‌లైన్: మహేష్ విద్యాభవన్ బౌలర్ కమల్ కుమార్ 6 వికెట్లతో హెచ్‌పీఎస్-ఆర్ జట్టును దెబ్బతీశాడు. దీంతో మహేష్ విద్యాభవన్ 4 వికెట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. హెచ్‌సీఏ బ్రదర్ జాన్ ఆఫ్ గాడ్ అండర్-14 నాకౌట్ టోర్నీలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన హెచ్‌పీఎస్-ఆర్ 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. తరుణ్ సాకేత్ 38 పరుగులు చేశాడు. అనంతరం బరిలోకి దిగిన మహేష్ విద్యాభవన్ 6 వికె ట్లకు 162 పరుగులు చేసింది. ఆశిష్ శ్రీవాస్తవ్ (50) అర్ధ సెంచరీతో చెలరేగగా... ఓంకార్ గుంజల్ 43 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. హెచ్‌పీఎస్-ఆర్ బౌలర్ సాయి తేజ 3 వికెట్లు తీశాడు. మరో మ్యాచ్‌లో సెయింట్ ఆండ్రూస్ జట్టు 71 పరుగుల తేడాతో హెచ్‌పీఎస్-బీ జట్టుపై గెలుపొందింది. తొలుత బరిలోకి దిగిన సెయింట్ ఆండ్రూస్ 171 పరుగులకు ఆలౌటైంది. వైష్ణవ్ (92) అర్ధ సెంచరీతో రాణించాడు. తర్వాత బరిలోకి దిగిన హెచ్‌పీఎస్-బీ 100 పరుగులకే కుప్పకూలింది. సెయింట్ ఆండ్రూస్ బౌలర్ అలంకృత్, ఆదిత్య చెరో మూడు వికెట్లు పడగొట్టారు.