డాలర్‌పై మోజు! | dollar ki maro vaipu audio released | Sakshi
Sakshi News home page

డాలర్‌పై మోజు!

Published Sun, May 31 2015 11:56 PM | Last Updated on Sun, Sep 3 2017 3:01 AM

డాలర్‌పై మోజు!

డాలర్‌పై మోజు!

 ‘‘ప్రస్తుత తరంలో డాలర్లపై మోజుపడే వారి శాతమే ఎక్కువ. డాలర్ల కోసం అమెరికా వెళ్లిపోయి, సొంత గడ్డను కూడా మర్చిపోతున్నారు. ఈ కోవకు చెందినవారి జీవితం ఆధారంగా ‘డాలర్‌కి మరోవైపు’ చిత్రం తీశాం’’ అని నిర్మాత సత్యం అన్నారు. యశ్వంత్, మిత్ర జంటగా పూసల దర్శకత్వంలో బేబి శ్రీక్రితి సమర్పణలో రూపొందిన ఈ చిత్రానికి కమల్‌కుమార్ పాటలు స్వరపరిచారు. ఈ పాటల సీడీని ‘మా’ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ ఆవిష్కరించారు. ‘‘ప్రస్తుతం సినిమా పరిశ్రమలో చిన్న చేపను పెద్ద చేపలు మింగేస్తున్నాయనీ, అలా కాకుండా సినీ పెద్దలు ఇలాంటి చిన్న చిత్రాలను ప్రోత్సహించాలి’’ అని ఏపీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ చెప్పారు.
 

Advertisement
Advertisement