డాలర్‌పై మోజు!
‘‘ప్రస్తుత తరంలో డాలర్లపై మోజుపడే వారి శాతమే ఎక్కువ. డాలర్ల కోసం అమెరికా వెళ్లిపోయి, సొంత గడ్డను కూడా మర్చిపోతున్నారు. ఈ కోవకు చెందినవారి జీవితం ఆధారంగా ‘డాలర్‌కి మరోవైపు’ చిత్రం తీశాం’’ అని నిర్మాత సత్యం అన్నారు. యశ్వంత్, మిత్ర జంటగా పూసల దర్శకత్వంలో బేబి శ్రీక్రితి సమర్పణలో రూపొందిన ఈ చిత్రానికి కమల్‌కుమార్ పాటలు స్వరపరిచారు. ఈ పాటల సీడీని ‘మా’ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ ఆవిష్కరించారు. ‘‘ప్రస్తుతం సినిమా పరిశ్రమలో చిన్న చేపను పెద్ద చేపలు మింగేస్తున్నాయనీ, అలా కాకుండా సినీ పెద్దలు ఇలాంటి చిన్న చిత్రాలను ప్రోత్సహించాలి’’ అని ఏపీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ చెప్పారు.