జింఖానా, న్యూస్‌లైన్: మహేష్ విద్యాభవన్ బౌలర్ కమల్ కుమార్ 6 వికెట్లతో హెచ్‌పీఎస్-ఆర్ జట్టును దెబ్బతీశాడు. దీంతో మహేష్ విద్యాభవన్ 4 వికెట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది.
హెచ్‌సీఏ బ్రదర్ జాన్ ఆఫ్ గాడ్ అండర్-14 నాకౌట్ టోర్నీలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన హెచ్‌పీఎస్-ఆర్ 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. తరుణ్ సాకేత్ 38 పరుగులు చేశాడు. అనంతరం బరిలోకి దిగిన మహేష్ విద్యాభవన్ 6 వికె ట్లకు 162 పరుగులు చేసింది.
ఆశిష్ శ్రీవాస్తవ్ (50) అర్ధ సెంచరీతో చెలరేగగా... ఓంకార్ గుంజల్ 43 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. హెచ్‌పీఎస్-ఆర్ బౌలర్ సాయి తేజ 3 వికెట్లు తీశాడు. మరో మ్యాచ్‌లో సెయింట్ ఆండ్రూస్ జట్టు 71 పరుగుల తేడాతో హెచ్‌పీఎస్-బీ జట్టుపై గెలుపొందింది. తొలుత బరిలోకి దిగిన సెయింట్ ఆండ్రూస్ 171 పరుగులకు ఆలౌటైంది. వైష్ణవ్ (92) అర్ధ సెంచరీతో రాణించాడు. తర్వాత బరిలోకి దిగిన హెచ్‌పీఎస్-బీ 100 పరుగులకే కుప్పకూలింది. సెయింట్ ఆండ్రూస్ బౌలర్ అలంకృత్, ఆదిత్య చెరో మూడు వికెట్లు పడగొట్టారు.
కమల్ విజృంభణ
Published Fri, Nov 22 2013 11:40 PM | Last Updated on Sat, Sep 2 2017 12:52 AM
Advertisement
Advertisement