తనిష్క్ డబుల్ ధమాకా | tanishq double dhamaka | Sakshi
Sakshi News home page

తనిష్క్ డబుల్ ధమాకా

Published Sat, Jan 11 2014 12:31 AM | Last Updated on Sat, Sep 2 2017 2:29 AM

tanishq double dhamaka

జింఖానా, న్యూస్‌లైన్: అఖిల భారత బీఎస్‌ఎన్‌ఎల్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ ఆటగాడు తనిష్క్ డబుల్ ధమాకా సాధించాడు. పురుషుల సింగిల్స్, డబుల్స్ టైటిల్స్‌ను గెలుచుకున్నాడు.
 
  యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర రెడ్డి స్టేడియంలో జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో తనిష్క్ 21-18, 21-13తో సర్వజిత్ బౌమిక్ (పశ్చిమ బెంగాల్)పై నెగ్గగా, డబుల్స్‌లో తనిష్క్-అనిల్ కుమార్ జోడి 21-19, 21-13తో అభిజిత్-హతిబార్వ (అస్సాం) జోడిని కంగుతినిపించింది. మహిళల సింగిల్స్ ఫైనల్లో మనాలి (అస్సాం) 21-10, 21-10తో సుమిత్ర పుజారి (అస్సాం)పై నెగ్గి టైటిల్ సొంతం చేసుకుంది. మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్లో అభిజిత్-మనాలి (అస్సాం) జంట 21-14, 21-9తో తనిష్క్-ఉష (ఆంధ్రప్రదేశ్) జంటపై గెలుపొందింది. వెటరన్ సింగిల్స్ ఫైనల్లో దినేష్ (మధ్యప్రదేశ్) 17-21, 23-21, 26-24తో శ్రీనివాసరావు (ఆంధ్రప్రదేశ్)పై, వెటరన్ డబుల్స్ ఫైనల్లో శ్రీనివాసరావు-ప్రదీప్ కుమార్ ద్వయం 21-18, 19-21, 21-18తో న జీముద్దీన్-ఆంటో (కేరళ) ద్వయంపై గెలిచింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement