doubles titles
-
‘గిన్నిస్’లోకి సాత్విక్ స్మాష్...
సొకా (జపాన్): తెలుగుతేజం సాత్విక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి ఇన్నాళ్లూ ఇంటాబయటా డబుల్స్ టైటిల్స్‌తో పతాక శీర్షికల్లో నిలిచాడు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఈ బ్యాడ్మింటన్ స్టార్ ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు’ల్లోకెక్కాడు. చిరాగ్ శెట్టితో కలిసి అతను ఇటీవల ఇండోనేసియా ఓపెన్‌లో పురుషుల డబుల్స్ టైటిల్ గెలిచాడు. మేటి డబుల్స్ షట్లర్‌గా రాటుదేలిన సాత్విక్‌కు టైటిళ్లు కొత్తేం కాదు. అయితే తాజాగా బ్యాడ్మింటన్ చరిత్రలో అత్యంత వేగవంతమైన స్మాష్‌తో సాత్విక్ రికార్డు సృష్టించాడు. జపాన్‌కు చెందిన ప్రముఖ క్రీడా ఉపకరణాల సంస్థ యోనెక్స్ తమ ఫ్యాక్టరీలో ఇటీవల నిర్వహించిన టెస్టులో సాత్విక్ రాకెట్ వేగంతో స్మాష్ కొట్టాడు. సాత్విక్ స్మాష్‌కు షటిల్ గంటకు 565 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లింది. ఫార్ములావన్ సర్క్యూట్లో రయ్ రయ్‌మని రాకెట్ వేగంతో దూసుకెళ్లే కారు వేగం (గంటకు 372.6 కి.మీ.) కంటే కూడా సాత్విక్ స్మాష్ వేగమే ఎక్కువ! బ్యాడ్మింటన్‌లో ఇది అసాధారణ వేగం. దీంతో దశాబ్దం క్రిందట మలేసియన్ షట్లర్ తన్ బూన్ హియాంగ్ (2013లో) గంటకు 493 కి.మీ. వేగంతో కొట్టిన స్మాష్ రికార్డును సాత్విక్ బద్దలుకొట్టాడు. తద్వారా ‘ఫాస్టెస్ట్ స్మాష్’ రికార్డును సాత్విక్ సాయిరాజ్ తన పేరిట గిన్నిస్ బుక్‌లో లిఖించుకున్నాడు. మహిళల విభాగంలో మలేసియా షట్లర్ తన్ పియర్లీ గంటకు 438 కి.మీ. వేగంతో కొట్టిన స్మాష్ రికార్డు కూడా గిన్నిస్ బుక్‌లో చోటు దక్కించుకుంది. ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశం ప్రస్తుతం కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో ఆడుతున్న సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 21–16, 21–14తో సుపక్ జోమ్కో–కిటినిపోంగ్ కెద్రెన్ (థాయ్‌లాండ్) జంటను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. భారత్‌కే చెందిన ఎం.ఆర్.అర్జున్–ధ్రువ్ కపిల జోడీ తొలి రౌండ్లోనే ని్రష్కమించింది. -
ఆక్లాండ్‌లో పేస్... సిడ్నీలో బోపన్న
కొత్త ఏడాది భారత టెన్నిస్ ఆటగాళ్లకు కలిసొస్తోంది. శుక్రవారం సానియా మీర్జా సిడ్నీ ఓపెన్‌లో డబుల్స్ టైటిల్ నెగ్గగా... మరుసటి రోజే భారత ఆటగాళ్ల ఖాతాలో మరో రెండు డబుల్స్ టైటిల్స్ చేరడం విశేషం. న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో జరిగిన హైనికెన్ ఓపెన్‌లో లియాండర్ పేస్ (భారత్) తన భాగస్వామి రావెన్ క్లాసెన్ (దక్షిణాఫ్రికా)తో కలిసి చాంపియన్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగిన సిడ్నీ ఓపెన్‌లో రోహన్ బోపన్న (భారత్) తన భాగస్వామి డానియల్ నెస్టర్ (కెనడా)తో కలిసి విజేతగా అవతరించాడు. మెల్బోర్న్లో యువతార యూకీ బాంబ్రీ క్వాలిఫయింగ్ ఫైనల్ రౌండ్లో నెగ్గి ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రధాన ‘డ్రా’కు అర్హత సాధించాడు.. డబుల్స్ టైటిల్స్ నెగ్గిన భారత ఆటగాళ్లు ఆక్లాండ్: తన 99వ భాగస్వామితో కలిసి భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ తొలి టైటిల్ సాధించాడు. శనివారం ముగిసిన హైనికెన్ ఓపెన్‌లో పేస్-క్లాసెన్ ద్వయం 7-6 (7/1), 6-4తో డొమినిక్ ఇంగ్లోట్ (బ్రిటన్) -ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) జంటను ఓడించింది. కెరీర్లో 93వ డబుల్స్ ఫైనల్ ఆడిన 41 ఏళ్ల పేస్‌కిది 55వ టైటిల్ కావడం విశేషం. 1997 నుంచి ప్రతి ఏడాది పేస్ కనీసం ఒక టైటిలైనా గెలుస్తూ వస్తున్నాడు. విజేతగా నిలిచిన పేస్ జోడీకి 25,670 డాలర్ల (రూ. 15 లక్షల 81 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఫైనల్ చేరుకునే క్రమంలో ఆడిన మూడు మ్యాచ్‌లను సూపర్ టైబ్రేక్‌లో నెగ్గిన పేస్ జంట టైటిల్ పోరును మాత్రం వరుస సెట్లలో ముగించింది. సిడ్నీ: తన కొత్త భాగస్వామి డానియల్ నెస్టర్‌తో రోహన్ బోపన్న తొలి టైటిల్‌ను గెల్చుకున్నాడు. శనివారం జరిగిన సిడ్నీ ఓపెన్ ఫైనల్లో బోపన్న-నెస్టర్ (కెనడా) ద్వయం 6-4, 7-6 (7/5)తో జీన్ జూలియన్ రోజర్ (నెదర్లాండ్స్)-హొరియా టెకావ్ (రుమేనియా) జంటపై గెలిచింది. 86 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో బోపన్న జోడీ ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. గతవారం బ్రిస్బేన్ ఓపెన్‌లో తొలి రౌండ్లోనే ఓడిన ఈ జంట సిడ్నీలో మాత్రం విజేతగా నిలిచింది. టైటిల్ నెగ్గిన బోపన్న జోడీకి 24,280 డాలర్ల (రూ. 14 లక్షల 95 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 34 ఏళ్ల బోపన్నకు కెరీర్లో ఇది 11వ డబుల్స్ టైటిల్. 42 ఏళ్ల నెస్టర్కిది 86వ డబుల్స్ టైటిల్ కావడం విశేషం. గత 22 ఏళ్ల నుంచి నెస్టర్ ప్రతి ఏడాది కనీసం ఒక టైటిలైనా గెలుస్తున్నాడు. మైక్ బ్రయాన్ (105), బాబ్ బ్రయాన్ (103) తర్వాత ఏటీపీ సర్యూట్‌లో అత్యధిక టైటిల్స్ నెగ్గిన మూడో డబుల్స్ ప్లేయర్‌గా నెస్టర్ నిలిచాడు. -
తనిష్క్ డబుల్ ధమాకా
జింఖానా, న్యూస్‌లైన్: అఖిల భారత బీఎస్ఎన్ఎల్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ ఆటగాడు తనిష్క్ డబుల్ ధమాకా సాధించాడు. పురుషుల సింగిల్స్, డబుల్స్ టైటిల్స్‌ను గెలుచుకున్నాడు. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర రెడ్డి స్టేడియంలో జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో తనిష్క్ 21-18, 21-13తో సర్వజిత్ బౌమిక్ (పశ్చిమ బెంగాల్)పై నెగ్గగా, డబుల్స్‌లో తనిష్క్-అనిల్ కుమార్ జోడి 21-19, 21-13తో అభిజిత్-హతిబార్వ (అస్సాం) జోడిని కంగుతినిపించింది. మహిళల సింగిల్స్ ఫైనల్లో మనాలి (అస్సాం) 21-10, 21-10తో సుమిత్ర పుజారి (అస్సాం)పై నెగ్గి టైటిల్ సొంతం చేసుకుంది. మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో అభిజిత్-మనాలి (అస్సాం) జంట 21-14, 21-9తో తనిష్క్-ఉష (ఆంధ్రప్రదేశ్) జంటపై గెలుపొందింది. వెటరన్ సింగిల్స్ ఫైనల్లో దినేష్ (మధ్యప్రదేశ్) 17-21, 23-21, 26-24తో శ్రీనివాసరావు (ఆంధ్రప్రదేశ్)పై, వెటరన్ డబుల్స్ ఫైనల్లో శ్రీనివాసరావు-ప్రదీప్ కుమార్ ద్వయం 21-18, 19-21, 21-18తో న జీముద్దీన్-ఆంటో (కేరళ) ద్వయంపై గెలిచింది. -
సెమీస్‌లో సానియా జోడి
బీజింగ్: చైనా ఓపెన్‌లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జోడి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. డబుల్స్ టైటిల్‌కు ఇక రెండే అడుగుల దూరంలో నిలిచింది. జింబాబ్వేకు చెందిన కారా బ్లాక్‌తో జతకట్టిన హైదరాబాదీ స్టార్ 2-0తో వరుస సెట్లలో యంగ్ జాన్ చాన్-జి జెంగ్ (చైనీస్ తైపీ) ద్వయంపై విజయం సాధించింది. ఎనిమిదో సీడ్ భారత్-జింబాబ్వే జోడి 6-4, 6-1తో తైపీ జంటపై గెలుపొందింది. నాలుగు బ్రేక్ పాయింట్లను సాధించిన సానియా జంట ఆద్యంతం చక్కని ఆటతీరుతో ఆకట్టుకుంది. సెమీఫైనల్లో సానియా-కారా ఇటలీకి చెందిన టాప్ సీడ్ రొబెర్టా విన్సీ-సారా ఎరానీలతో తలపడతారు.