సెమీస్‌లో సానియా జోడి | Fiery Sania Mirza in China Open doubles quarters | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో సానియా జోడి

Published Fri, Oct 4 2013 1:58 AM | Last Updated on Wed, Sep 19 2018 6:29 PM

సెమీస్‌లో సానియా జోడి - Sakshi

సెమీస్‌లో సానియా జోడి

బీజింగ్: చైనా ఓపెన్‌లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జోడి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. డబుల్స్ టైటిల్‌కు ఇక రెండే అడుగుల దూరంలో నిలిచింది. జింబాబ్వేకు చెందిన కారా బ్లాక్‌తో జతకట్టిన హైదరాబాదీ స్టార్ 2-0తో వరుస సెట్లలో యంగ్ జాన్ చాన్-జి జెంగ్ (చైనీస్ తైపీ) ద్వయంపై విజయం సాధించింది.

ఎనిమిదో సీడ్ భారత్-జింబాబ్వే జోడి 6-4, 6-1తో తైపీ జంటపై గెలుపొందింది. నాలుగు బ్రేక్ పాయింట్లను సాధించిన సానియా జంట ఆద్యంతం చక్కని ఆటతీరుతో ఆకట్టుకుంది. సెమీఫైనల్లో సానియా-కారా ఇటలీకి చెందిన టాప్ సీడ్ రొబెర్టా విన్సీ-సారా ఎరానీలతో తలపడతారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement