రెండో రౌండ్‌లో అనికేత్, రాహుల్ | Aniket,Rahul in the second round | Sakshi
Sakshi News home page

రెండో రౌండ్‌లో అనికేత్, రాహుల్

Published Sun, Feb 2 2014 12:26 AM | Last Updated on Sat, Sep 2 2017 3:15 AM

Aniket,Rahul  in the second round

జింఖానా, న్యూస్‌లైన్: ఏఐటీఏ టాలెంట్ సిరీస్ టెన్నిస్ టోర్నీ అండర్-14 బాలుర విభాగంలో వెంకట్ అనికే త్ రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు. సూర్యోదయ టెన్నిస్ అకాడమీ నిర్వహిస్తున్న ఈ టోర్నీ మొదటి రౌండ్‌లో అనికేత్ 8-0తో కొసరాజు హ ర్షిత్‌పై గెలుపొందాడు. ఇతర మ్యాచ్‌ల్లో రాహుల్ 8-0తో నిషాద్‌పై నెగ్గగా... దుర్గా హిమకేశ్ 8-0తో ఆకాశ్‌పై గెలిచాడు. అచిత్ బార్గత్ 8-0తో ఫణీంద్రపై గెలవగా... సాయి ప్రతీక్ 8-0తో సాయి సింహారెడ్డిని ఓడించాడు.
 
 ఇతర ఫలితాలు
 అండర్-16 బాలుర విభాగం: ప్రణవ్ రెడ్డి 8-2తో రిషిల్ గుప్తాపై; రిత్విక్ 8-1తో సచిత్‌పై; గౌతమ్ ఆకాశ్ 8-4తో సాయి సిద్ధార్థ్‌పై; ఆదిత్య 8-3తో రుచిత్ గౌడ్‌పై; నితిన్ 8-7, 7-3తో కార్తీక్ రెడ్డిపై; గౌరవ్ రెడ్డి 8-3తో తరుణ్‌పై; సుచిత్ 8-1తో రేవంత్ రెడ్డిపై; అక్షిత్ రెడ్డి 8-3తో సంప్రీత్ రెడ్డిపై; వినయ్ 8-4తో అభినవ్‌పై; సాయిహర్ష 8-0తో అర్జున్ రెడ్డిపై విజయం సాధించారు.
 
 అండర్-14 బాలికల విభాగం: లాస్య పట్నాయక్ 8-0తో లిఖితా మాన్సినిపై; శ్రేయ 8-1తో అవంతికా రెడ్డిపై; తనూజ చౌహాన్ 8-2తో దుర్గా శ్రీవేదపై; చరితా వాసి రెడ్డి 8-6తో ఫియోనా రేనాల్డ్‌పై; లిపికా 8-3తో సంస్కృతిపై నెగ్గారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement