ఐదు వికెట్లు పడగొట్టిన హైదరాబాద్ బౌలర్
హిమాచల్ ప్రదేశ్ 275 ఆలౌట్
హైదరాబాద్‌కు 290 పరగుల ఆధిక్యం
సాక్షి, హైదరాబాద్: రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నీలో భాగంగా హిమాచల్ ప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్ బౌలర్ అనికేత్ రెడ్డి (5/72) సత్తా చాటాడు. ఫలితంగా ఓవర్‌నైట్ స్కోరు 33/1తో శనివారం మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన హిమాచల్ ప్రదేశ్ జట్టు 92 ఓవర్లలో 275 పరుగులకు ఆలౌటైంది. ఇనేశ్ మహజన్ (79 బంతుల్లో 68 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ అర్ధశతకం సాధించగా... శుభమ్ అరోరా (53; 7 ఫోర్లు) హాఫ్‌సెంచరీ చేశాడు.
అంకిత్ (31), అపూర్వ్ వాలియా (37), ఆకాశ్ వశిష్ట్ (46) తలా కొన్ని పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో తనయ్ త్యాగరాజన్ రెండు వికెట్లు తీయగా... నిశాంత్, వరుణ్ గౌడ్‌లకు చెరో వికెట్ దక్కింది. దీంతో హైదరాబాద్‌కు 290 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించడంతో ప్రత్యర్థిని ఫాలోఆన్‌కు ఆహ్వానించింది.
శనివారం ఆట ముగిసే సమయానికి హిమాచల్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. శుభమ్ అరోరా (16 బ్యాటింగ్), ప్రశాంత్ చోప్రా (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. నేడు ఆటకు చివరి రోజు కాగా... చేతిలో 10 వికెట్లు ఉన్న హిమాచల్ జట్టు... హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 269 పరుగులు వెనుకబడి ఉంది.
స్కోరు వివరాలు
హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్: 565; హిమాచల్ ప్రదేశ్ తొలి ఇన్నింగ్స్: శుభమ్ అరోరా (ఎల్బీ) (బి) అనికేత్ రెడ్డి 53; ప్రశాంత్ చోప్రా (సి) రాహుల్ రాధేశ్ (బి) నిశాంత్ 1; అంకిత్ (సి) తన్మయ్ అగర్వాల్ (బి) తనయ్ త్యాగరాజన్ 31; అపూర్వ్ వాలియా (స్టంప్డ్) రాహుల్ రాధేశ్ (బి) అనికేత్ రెడ్డి 37; ఆకాశ్ వశిస్ట్ (సి) మిలింద్ (బి) అనికేత్ రెడ్డి 46; రిషి ధవన్ (ఎల్బీ) తనయ్ త్యాగరాజన్ 22; ఇనేశ్ మహజన్ (నాటౌట్) 68; ముకుల్ నేగీ (సి) హిమతేజ (బి) అనికేత్ రెడ్డి 0; మయాంక్ డాగర్ (సి) రక్షణ్ రెడ్డి (బి) వరుణ్ గౌడ్ 0; వైభవ్ అరోరా (సి) రక్షణ్ రెడ్డి (బి) అనికేత్ రెడ్డి 3; దివేశ్ శర్మ (రనౌట్/హిమతేజ) 1; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (92 ఓవర్లలో ఆలౌట్) 275. వికెట్ల పతనం: 1–11, 2–78, 3–111, 4–144, 5–188, 6–217, 7–217, 8–218, 9–267, 10–275, బౌలింగ్: నిశాంత్ 12–3–52–1; చామా మిలింద్ 13–1–32–0; తనయ్ త్యాగరాజన్ 24–4–62–2; అనికేత్ రెడ్డి 25–5–72–5; రక్షణ్ రెడ్డి 13–1–29–0; వరుణ్ గౌడ్ 5–0–16–1.
హిమాచల్ ప్రదేశ్ రెండో ఇన్నింగ్స్: శుభమ్ అరోరా (బ్యాటింగ్) 16; ప్రశాంత్ చోప్రా (బ్యాటింగ్) 1; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 21. బౌలింగ్: తనయ్ త్యాగరాజన్ 3–0–13–0; రక్షణ్ రెడ్డి 2–1–4–0.
Comments
Please login to add a commentAdd a comment