29 నుంచి బాస్కెట్‌బాల్ లీగ్ | basket ball league starts on 29 | Sakshi
Sakshi News home page

29 నుంచి బాస్కెట్‌బాల్ లీగ్

Dec 29 2013 1:40 AM | Updated on Sep 2 2017 2:04 AM

ఆంధ్రప్రదేశ్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ఈ నెల 29 నుంచి బీఎఫ్‌ఐ ఐఎంజీ రిలయన్స్ కాలేజ్ బాస్కెట్‌బాల్ లీగ్ నిర్వహించనుంది. ఈ టోర్నీలో పురుషుల, మహిళల విభాగాల్లో మొత్తం 20 జట్లు పాల్గొననున్నాయి.

జింఖానా, న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ఈ నెల 29 నుంచి బీఎఫ్‌ఐ ఐఎంజీ రిలయన్స్ కాలేజ్ బాస్కెట్‌బాల్ లీగ్ నిర్వహించనుంది. ఈ టోర్నీలో పురుషుల, మహిళల విభాగాల్లో మొత్తం 20 జట్లు పాల్గొననున్నాయి. ఈ జట్లను నాలుగు గ్రూపులుగా విభజించి 96 మ్యాచ్‌లను నిర్వహిస్తారు. విజేతగా నిలిచిన వారికి ఏప్రిల్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది.
 
 పురుషుల గ్రూప్ ‘ఎ’ జట్లు: లయోలా అకాడమీ, భవాన్స్ డిగ్రీ కాలేజి, మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజి, ముఫకంజా కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజి, నిజాం కాలేజి. గ్రూప్ ‘బి’ జట్లు: ఏవీ కాలేజి, సెయింట్ మార్టిన్స్ ఇంజినీరింగ్ కాలేజి, అవంతి డి గ్రీ కాలేజి, బిట్స్ పిలాని హైదరాబాద్, సీవీఎస్‌ఆర్ ఇంజినీరింగ్ కాలేజి.
 
 మహిళల గ్రూప్ ‘ఎ’ జట్లు: లయోలా అకాడమీ, సెయింట్ ఆన్స్ డిగ్రీ కాలేజి, కస్తూర్బా డిగ్రీ కాలేజి, సీవీఎస్‌ఆర్ ఇంజినీరింగ్ కాలేజి, గోకరాజు నూకరాజు ఇంజినీరింగ్ కాలేజి.
 గ్రూప్ ‘బి’ జట్లు: నారాయణమ్మ ఇంజినీరింగ్ కాలేజి, సెయింట్ ఫ్రాన్సిస్ డిగ్రీ కాలేజి, సెయింట్ మార్టిన్స్ ఇంజినీరింగ్ కాలేజి, బిట్స్ పిలాని హైదరాబాద్, ప్రభుత్వ వ్యాయామ విద్యా కళాశాల.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement