విజేత తులసి హైస్కూల్ | tulsi high school won c.k nayudu trophy | Sakshi
Sakshi News home page

విజేత తులసి హైస్కూల్

Published Sat, Dec 21 2013 12:48 AM | Last Updated on Sat, Sep 2 2017 1:48 AM

tulsi high school won c.k nayudu trophy

 జింఖానా, న్యూస్‌లైన్: కల్నల్ సీకే నాయుడు ట్రోఫీలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో తులసి హైస్కూల్ జట్టు విజేతగా నిలిచింది. అండర్-14 విభాగంలో జరిగిన ఫైనల్స్‌లో తులసి జట్టు 34 పరుగుల తేడాతో భవాన్స్ జట్టుపై విజయం సాధించింది.

మొదట బరిలోకి దిగిన తులసి 5 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేయగా... అనంతరం భవాన్స్ 8 వికెట్లు కోల్పోయి 64 పరుగులు మాత్రమే చేయగలిగింది. స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ 15 రోజుల పాటు నిర్వహించిన ఈ టోర్నీ అండర్-11, 13, 14 విభాగాల్లో జరిగింది. అండర్-11 విభాగంలో భవాన్స్ జట్టు టైటిల్ కైవసం చేసుకోగా... అదే జట్టు బ్యాట్స్‌మన్ అశ్మిత్ యంగ్ సీకే నాయుడు-2013 అవార్డును గెలుచుకున్నాడు. విజేతలకు బ్రిగే డియర్ అనుపమ్ శర్మ ముఖ్య అతిథిగా విచ్చేసి బహుమతులు అందజేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement