జాతీయ వెటరన్ టీటీ
జింఖానా, న్యూస్‌లైన్: జాతీయ వెటరన్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్ మిక్స్‌డ్ డబుల్స్ 65+ ఈవెంట్లో జీవీఎస్‌వీరావు (ఏపీ)-శోభా నాయుడు (మహారాష్ట్ర) జోడి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. ఈ పోటీలు ఇటీవల హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో జరిగాయి. పురుషుల 65+ టీమ్ ఈవెంట్‌లో జీవీఎస్‌వీ రావు, దేవేంద్రనాథ్, ఎస్‌పీ జగన్నాథ్, పాండు, నాగరాజ్‌లతో కూడిన ఏపీ జట్టు కాంస్య పతకాన్ని దక్కించుకుంది.
పురుషుల డబుల్స్ 65+ ఈవెంట్లో దేవేంద్రనాథ్ (ఏపీ)-రామకృష్ణ (తమిళనాడు) ద్వయం రజత పతకం గెలుచుకోగా... జీవీఎస్‌వీ రావు- ఎస్‌పీ జగన్నాథ్ జోడి కాంస్య పతకం సాధించింది. మహిళల 65+ సింగిల్స్ ఈవెంట్లో లక్ష్మీ కృష్ణన్ రెండో స్థానంలో నిలవగా... అపర్ణ మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. పురుషుల సింగిల్స్ 75+ ఈవెంట్లో ప్రసాద రావు కాంస్యం సాధించగా... డబుల్స్ 70+ ఈవెంట్లో అయూబ్-రామమూర్తి జంట మూడో స్థానంలో నిలిచింది.
జీవీఎస్‌వీ రావు జోడికి స్వర్ణం
Published Mon, Mar 10 2014 12:04 AM | Last Updated on Sat, Sep 2 2017 4:31 AM
Advertisement
Advertisement