Table tennis tournment
-
వరుణ్, అంజలిలకు క్యాడెట్ టైటిల్స్
రాష్ట్ర ర్యాంకింగ్ టీటీ టోర్నీ ఎల్బీ స్టేడియం: తెలంగాణ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో బాలబాలికల క్యాడెట్ సింగిల్స్ టైటిళ్లను బి.వరుణ్ శంకర్, అంజలి గెలుచుకున్నారు. సెయింట్ పాల్స్ హైస్కూల్ డైమండ్ జూబ్లీ సందర్భంగా హైదర్‌గూడలోని స్కూల్ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న ఈ పోటీల్లో ఆదివారం జరిగిన క్యాడెట్ బాలుర సింగిల్స్ ఫైనల్లో వరుణ్ శంకర్ (గ్లోబల్ టేబుల్ టెన్నిస్ అకాడమీ-జీటీటీఏ) 11-7, 14-12, 6-11, 13-11తో అద్వైత్ (ఆవా)పై విజయం సాధించాడు. క్యాడెట్ బాలికల సింగిల్స్ ఫైనల్లో అంజలి (గుజరాతీ సేవామండలి-జీఎస్ఎం) 11-3, 6-11, 11-8, 11-7తో భవిత (జీఎస్ఎం)పై గెలిచింది. సబ్ జూనియర్ బాలికల సింగిల్స్‌లో జి. ప్రణీత (జీఎస్ఎం), వరుణి జైస్వాల్ (జీఎస్ఎం) ఫైనల్లోకి ప్రవేశించారు. తొలి సెమీఫైనల్లో ప్రణీత 12-10, 11-8, 8-11, 11-6తో రాగ నివేదిత (జీటీటీఏ)పై విజయం సాధించింది. రెండో సెమీఫైనల్లో వరుణి 11-7, 12-10, 12-10, 11-9తో వి.సస్య (ఆవా)పై గెలిచింది. సబ్ జూనియర్ బాలుర సింగిల్స్ సెమీస్‌లో సరోజ్ సిరిల్ (ఎస్‌పీటీటీఏ) 11-9, 11-6, 5-11, 12-10, 14-12తో సాయి తేజేశ్ (ఎస్‌పీటీటీఏ)పై, ఎస్.ఎఫ్.ఆర్.స్నేహిత్ (జీటీటీఏ) 11-9, 12-10, 9-11, 11-8, 11-7తో అమాన్ ఉల్ రెహ్మాన్ (ఎస్‌పీటీటీఏ)పై గెలిచారు. ఫైనల్లో పోస్టల్, ఆర్బీఐ ఇంటర్ ఇన్స్టిట్యూషన్ టీమ్ చాంపియన్‌షిప్‌లో పోస్టల్, ఆర్బీఐ జట్లు ఫైనల్లోకి చేరాయి. సెమీఫైనల్లో ఆర్బీఐ 3-1తో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)పై గెలిచింది. ఇదివరకే పోస్టల్ జట్లు ఫైనల్ పోరుకు అర్హత సంపాదించాయి. -
సెయింట్ పాల్స్ శుభారంభం
తెలంగాణ టేబుల్ టెన్నిస్ టోర్నీ ఎల్బీ స్టేడియం: తెలంగాణ రాష్ట్ర ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో సెయింట్ పాల్స్, భారతీయ విద్యాభవన్ పబ్లిక్ స్కూల్ (బీవీబీపీఎస్-జూబ్లీహిల్స్) జట్లు శుభారంభం చేశాయి. హైదర్‌గూడలోని సెయింట్ పాల్స్ హైస్కూల్ డైమండ్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం మొదలైన ఈ ఇంటర్ స్కూల్ చాంపియన్‌షిప్ టీమ్ విభాగంలో సెయింట్ పాల్స్ హైస్కూల్ జట్టు 3-0తో డాన్ బాస్కో స్కూల్ జట్టుపై విజయం సాధించింది. సింగిల్స్‌లో దివేష్ (సెయింట్ పాల్స్) 11-4, 19-17, 11-7తో జీవన్‌పై, రిత్విక్ (సెయింట్ పాల్స్) 11-7, 11-4, 11-5తో నిఖిల్‌పై గెలిచారు. డబుల్స్‌లో దివేష్-రిత్విక్ జోడి 11-9, 11-3, 11-5తో జీవన్-నిఖిల్ జోడిపై గెలిచింది. మరో మ్యాచ్‌లో బీవీబీపీఎస్ (సి) జట్టు 3-2తో దేవసియా స్కూల్ జట్టుపై గెలిచింది. సింగిల్స్‌లో ధనుష్ (బీవీబీపీఎస్) 11-5, 11-8, 11-8తో వినయ్‌పై గెలిచాడు. రెండో సింగిల్స్‌లో మితుల్ (బీవీబీపీఎస్) 8-11, 9-11, 5-11తో ప్రద్యుమ్న(దేవసియా) చేతిలో ఓడిపోయాడు. డబుల్స్‌లో భువన్-మితుల్ (బీవీబీపీఎస్) జోడి 11-4, 11-4, 12-10తో ప్రద్యుమ్న-యతీష్ (దేవసియా) జోడిపై గెలిచింది. రివర్స్ సింగిల్స్‌లో ధనుష్ (బీవీబీపీఎస్) 9-11, 11-7, 8-11, 11-6, 4-11తో ప్రద్యుమ్న (దేవసియా) చేతిలో ఓడిపోగా, మితుల్ (బీవీబీపీఎస్) 11-7, 11-6, 12-10తో వినయ్(దేవసియా) పై నెగ్గాడు. ఇతర మ్యాచ్‌ల్లో లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ 3-0తో మెరిడియన్‌పై, ఓక్రిడ్జ్ స్కూల్ 3-0తో బీవీబీపీఎస్పై గెలిచాయి. -
క్యాడెట్ చాంప్స్ వరుణ్, అంజలి
సెయింట్ పాల్స్ టీటీ టోర్నీ ఎల్బీ స్టేడియం: సెయింట్ పాల్స్ అకాడమీ స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో వరుణ్, అంజలి విజేతలుగా నిలిచారు. క్యాడెట్ బాలుర సింగిల్స్ టైటిల్‌ను గ్లోబల్ టీటీ అకాడమీ (జీటీటీఏ)కి చెందిన బి.వరుణ్ శంకర్ కైవసం చేసుకున్నాడు. క్యాడెట్ బాలికల సింగిల్స్ ట్రోఫీని ఎన్.అంజలి గెలుచుకుంది. హైదర్‌గూడలోని సెయింట్ పాల్స్ హైస్కూల్లో శనివారం జరిగిన క్యాడెట్ బాలుర సింగిల్స్ ఫైనల్లో వరుణ్ 11-6, 11-7, 11-8తో అద్వైత్ (ఆనంద్‌నగర్ వెల్పేర్ అసోసియేషన్)పై విజయం సాధించాడు. బాలికల ఫైనల్లో అంజలి (గుజరాతీ సేవా మండలి) 11-8, 11-6, 11-1తో రుచిరా రెడ్డి (ఎస్‌పీటీటీఏ)పై గెలిచింది. స్నేహిత్‌కు సబ్-జూనియర్ టైటిల్ సబ్-జూనియర్ బాలుర సింగిల్స్ టైటిల్‌ను నిరుటి విజేత ఎస్.ఎఫ్.ఆర్.స్నేహిత్(జీటీటీఏ) నిలబెట్టుకున్నాడు. సబ్-జూనియర్ బాలికల సింగిల్స్ విభాగంలో జి.ప్రణీత (జీఎస్ఎం) ఫైనల్లోకి చేరింది. బాలుర సింగిల్స్ ఫైనల్లో స్నేహిత్ 11-4, 13-11, 11-4, 11-6తో సాయి తేజస్ (ఎస్‌పీటీటీఏ)పై నెగ్గాడు. బాలికల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రణీత 11-4, 7-11, 11-9, 11-7, 7-11, 12-10తో పోరాడి వరుణి జైస్వాల్ (జీఎస్ఎం)పై నెగ్గింది. టీమ్ చాంపియన్ ఎస్బీఐ ఇంటర్ ఇనిస్టిట్యూషన్ టీమ్ చాంపియన్‌షిప్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో ఎస్బీఐ జట్టు 3-2తో పోస్టల్ డిపార్ట్మెంట్ జట్టుపై గెలిచింది. -
జీవీఎస్‌వీ రావు జోడికి స్వర్ణం
జాతీయ వెటరన్ టీటీ జింఖానా, న్యూస్‌లైన్: జాతీయ వెటరన్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్ మిక్స్డ్ డబుల్స్ 65+ ఈవెంట్లో జీవీఎస్వీరావు (ఏపీ)-శోభా నాయుడు (మహారాష్ట్ర) జోడి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. ఈ పోటీలు ఇటీవల హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో జరిగాయి. పురుషుల 65+ టీమ్ ఈవెంట్లో జీవీఎస్‌వీ రావు, దేవేంద్రనాథ్, ఎస్పీ జగన్నాథ్, పాండు, నాగరాజ్‌లతో కూడిన ఏపీ జట్టు కాంస్య పతకాన్ని దక్కించుకుంది. పురుషుల డబుల్స్ 65+ ఈవెంట్లో దేవేంద్రనాథ్ (ఏపీ)-రామకృష్ణ (తమిళనాడు) ద్వయం రజత పతకం గెలుచుకోగా... జీవీఎస్‌వీ రావు- ఎస్పీ జగన్నాథ్ జోడి కాంస్య పతకం సాధించింది. మహిళల 65+ సింగిల్స్ ఈవెంట్లో లక్ష్మీ కృష్ణన్ రెండో స్థానంలో నిలవగా... అపర్ణ మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. పురుషుల సింగిల్స్ 75+ ఈవెంట్లో ప్రసాద రావు కాంస్యం సాధించగా... డబుల్స్ 70+ ఈవెంట్లో అయూబ్-రామమూర్తి జంట మూడో స్థానంలో నిలిచింది. -
రన్నరప్ నైనా
న్యూఢిల్లీ: నార్త్‌జోన్ జాతీయ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నీలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి నైనా జైస్వాల్ రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన సబ్ జూనియర్ బాలికల ఫైనల్లో మౌమితా దాస్ (పశ్చిమ బెంగాల్) 4-3తో నైనాపై గెలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థికి దీటుగా జవాబిచ్చిన నైనా ఆఖరి గేమ్‌లో కాస్త నిరాశపర్చింది. నిర్ణయాత్మక గేమ్‌లో ఇద్దరు చాలా జాగ్రత్తగా ఆడారు. అయితే మౌమితా బలమైన ఫోర్‌హ్యాండ్ షాట్స్‌తో అటాకింగ్ గేమ్‌ను ఆడింది. దీనికి అడ్డుకట్ట వేయడంలో నైనా విఫలమైంది. -
విజేత భారతీయ విద్యాభవన్
జింఖానా, న్యూస్‌లైన్: ఆలిండియా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) టేబుల్ టెన్నిస్ టోర్నీలో అండర్-14 బాలుర టీమ్ టైటిల్‌ను భారతీయ విద్యాభవన్ పబ్లిక్ స్కూల్ (బీవీబీపీఎస్, జూబ్లీహిల్స్) కైవసం చేసుకుంది. ఈ టోర్నీలో తొలిసారిగా రాష్ట్రానికి చెందిన సీబీఎస్ఈ జట్టుకు స్వర్ణం రావడం విశేషం. బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో జరిగిన టీమ్ చాంపియన్‌షిప్ ఈవెంట్ ఫైనల్లో బీవీబీపీఎస్ 3-1తో డాన్ బాస్కో స్కూల్ (అస్సాం)పై విజయం సాధించింది. మొదటి సింగిల్స్‌లో స్నేహిత్ 11-5, 11-5, 13-11తో మిన్మోయ్పై గెలిచాడు. రెండో సింగిల్స్‌లో మితుల్ అగర్వాల్ 6-11, 8-11, 4-11తో అలీకో చేతిలో ఓటమి పాలయ్యాడు. మూడో సింగిల్స్‌లో వరుణ్ శంకర్ 11-8, 11-4, 11-9తో బేబ్రాజ్పై గెలిచాడు. దీంతో బీవీబీపీఎస్ జట్టుకు 2-1తో ఆధిక్యం లభించింది. అనంతరం జరిగిన రివర్స్ సింగిల్స్‌లో సబ్ జూనియర్ విభాగంలో రాష్ట్ర నంబర్‌వన్ ఆటగాడైన స్నేహిత్ 11-7, 11-7, 3-11, 11-6తో సునాయాసంగా అలీకోను ఓడించి 3-1తో టైటిల్‌ను అందించాడు. ఈ టోర్నీలో అండర్-14 బాలుర వ్యక్తిగత విభాగంలో స్నేహిత్‌కు కాంస్యం దక్కింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో స్నేహిత్ 3-1తో రామ్ జైన్(రాజస్థాన్)పై నెగ్గాడు. -
స్నేహిత్ డబుల్ ధమాకా
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: రాష్ట్ర ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో జూనియర్, సబ్ జూనియర్ బాలుర సింగిల్స్ టైటిల్‌ను స్నేహిత్(జీపీటీటీఏ) కైవసం చేసుకున్నాడు. స్వామి వివేకానంద 150వ జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ పోటీల్లో గురువారం జరిగిన సబ్ జూనియర్ బాలుర సింగిల్స్ ఫైనల్లో స్నేహిత్ 10-12, 1-9, 11-5, 8-11, 14-12, 11-8 స్కోరుతో హర్ష్ లోహిత్ (వైఎంసీఏ)పై విజయం సాధించాడు. జూనియర్ బాలుర సింగిల్స్ ఫైనల్లో స్నేహిత్ 11-8, 12-10, 4-11, 9-11, 8-11తో హర్ష్ లోహిత్‌పై నెగ్గాడు. ఇతర ఫలితాలిలా ఉన్నాయి... పురుషుల సింగిల్స్: 1.పి.విఘ్నయ్ రెడ్డి (ఆర్బీఐ), 2.గౌతమ్ కృష్ణ (ఆవా). యూత్ బాలుర సింగిల్స్: 1.టి.సాయి ప్రణీత్ (విజయవాడ), 2.గౌతమ్ కృష్ణ (ఆవా). మహిళల సింగిల్స్: 1.నిఖత్ బాను (జీఎస్ఎం), 2.శ్రీజ (జీటీటీఏ). జూనియర్ బాలికల సింగిల్స్: 1.నైనా (ఎల్బీ స్టేడియం), 2.శ్రీజ (జీటీటీఏ). సబ్ జూనియర్ బాలికల సింగిల్స్: 1.శైలునూర్ బాషా (విజయవాడ). 2.కె.వి.వి.వైశాలి. -
క్యాడెట్ చాంప్స్ విష్ణు, ఆయుషి
జింఖానా, న్యూస్‌లైన్: అనంత నారాయణ రెడ్డి, రామేశ్వరమ్మ స్మారక స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నీలో క్యాడెట్ బాలుర విభాగంలో విష్ణు, బాలికల విభాగంలో ఆయుషి విజేతలుగా నిలిచారు. ఆనంద్‌నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ స్పోర్ట్స్ అకాడమీ (ఏడబ్ల్యూఏఎస్‌ఏ) నిర్వహిస్తున్న ఈ టోర్నీలో శనివారం జరిగిన ఫైనల్లో విష్ణు (జీటీటీఏ) 11-9, 11-8, 11-9తో అద్వైత్పై, ఆయుషి (జీఎస్ఎం) 11-9, 13-11, 11-5తో కాజోల్‌పై విజయం సాధించారు. మహిళల విభాగంలో నిఖత్ బాను (జీఎస్ఎం) 11-6, 11-5, 11-2తో ప్రణీత (ఐటీ)పై నెగ్గి సెమీస్‌కు చేరుకుంది. తనతో పాటుగా వైశాలి (ఏటీపీ) 11-9, 5-11, 10-12, 6-11, 11-6, 12-10, 11-3తో అనూష రెడ్డి (వీజేఏ)పై, నాగ శ్రావణి (ఏస్ అకాడమీ) 12-10, 7-11, 9-11, 11-8, 11-6, 11-2తో నూర్ బాషా (వీజేఏ)పై, మౌనిక (జీఎస్ఎం) 11-3, 11-2, 11-5, 11-4తో సైరా బాను (వీజేఏ)పై గెలుపొందారు. ఇతర ఫలితాలు సబ్ జూనియర్ బాలికల క్వార్టర్ ఫైనల్స్: వైశాలి (ఏటీపీ) 11-5, 9-11, 11-9, 11-6, 11-8తో అనూష రెడ్డి (వీజేఏ)పై, వరుణి జైస్వాల్ (జీఎస్ఎం) 11-3, 11-5, 11-9, 11-5తో సాస్య (ఏడబ్ల్యూఏ)పై, నూర్ బాషా (వీజేఏ) 8-11, 13-11, 8-11, 11-9, 5-11, 11-8, 11-6తో ప్రణీత (జీఎస్ఎం)పై, నాగ శ్రావణి (ఏస్ అకాడమీ) 6-11, 12-10, 11-8, 5-11, 14-12, 17-15తో లాస్య (ఏడ బ్ల్యూఏ)పై నెగ్గారు. జూనియర్ బాలికల క్వార్టర్ ఫైనల్స్: వైశాలి (ఏటీపీ) 12-10, 11-9, 11-8, 9-11, 11-6తో సైరా బాను (వీజేఏ)పై, నూర్ బాషా (వీజేఏ) 13-11, 11-1, 11-5, 11-8, 11-9తో అనూష రెడ్డి (వీజేఏ)పై, వరుణి జైస్వాల్ (జీఎస్ఎం) 13-11, 3-11, 11-4, 11-9, 11-6తో నాగ శ్రావణి (ఏస్ అకాడమీ)పై, మౌనిక (జీఎస్ఎం) 11-8, 11-9, 12-14, 4-11, 11-6, 11-7తో లాస్య (ఏడబ్ల్యూఏ)పై గెలిచారు. యూత్ బాలికల క్వార్టర్ ఫైనల్స్: నిఖత్ బాను (జీఎస్ఎం) 11-2, 11-8, 11-6, 11-9తో లాస్య (ఏడబ్ల్యూఏ)పై, నూర్ బాషా (వీజేఏ) 11-6, 11-6, 14-12, 11-5తో రాగనివేదిత (జీటీటీఏ)పై, కాజోల్ (వీజేఏ) 5-11, 11-7, 6-11, 11-9, 11-9, 3-11, 11-7తో సైరా బాను (వీజేఏ)పై, మైనిక (జీఎస్ఎం) 11-6, 15-13, 12-10, 11-1తో నాగ శ్రావణి (ఏస్ అకాడమీ)పై గెలుపొందారు. -
టాప్ సీడ్‌గా నిఖత్ బాను
జింఖానా, న్యూస్‌లైన్: అనంత నారాయణ రెడ్డి, రామేశ్వరమ్మల స్మారక స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నీలో నిఖత్ బాను టాప్ సీడ్‌గా బరిలోకి దిగనుంది. ఆనంద్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ స్పోర్ట్స్ అకాడమీ (ఏడబ్ల్యూఏఎస్‌ఏ) నిర్వహిస్తున్న ఈ టోర్నీలో ఆమెతో పాటు మౌనిక (జీఎస్ఎం), నూర్ బాషా (వీజేఏ), వైశాలి (ఏటీపీ) ఆడనున్నారు. శుక్రవారం ఈ టోర్నీని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి జస్టిస్ సి.వి శేష సాయి ముఖ్య అతిథిగా విచ్చేసి లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ టోర్నీ మూడు రోజుల పాటు జరగనుంది. టోర్నీలో పాల్గొనే ఇతర టాప్ సీడ్ల వివరాలు పురుషుల విభాగం: 1. విశాల్ (డెల్లాయిట్), 2. సోమంత్ ఘోష్ (ఎస్సీఆర్), 3. కృష్ణ కిరీటి (ఏజీస్), 4. సాయి ప్రణీత్. యూత్ బాలుర విభాగం: 1. సాయి ప్రణీత్ (వీజేఏ), 2. హర్ష (వైఎంసీఏ), 3. స్నేహిత్ (జీటీటీఏ), 4. గౌతమ్ కృష్ణ (ఏడబ్ల్యూఏ). యూత్ బాలికల విభాగం: 1. నిఖత్ బాను (జీఎస్ఎం), 2. మౌనిక (జీఎస్ఎం), 3. సైరా బాను (వీజేవై), 4. రాగ నివేదిత (జీటీటీఏ). జూనియర్ బాలురు: 1. హర్ష (వైఎంసీఏ), 2. అలీ మహ్మద్ (ఎస్‌పీఎస్‌టీటీఏ), 3. హరికృష్ణ (ఎస్‌పీఎస్‌టీటీఏ), 4. పవన్ కుమార్ (ఎస్‌పీఎస్‌టీటీఏ). జూనియర్ బాలికలు: 1. వైశాలి (ఏటీపీ), 2. మౌనిక (జీఎస్ఎం), 3. నాగ శ్రావణి (ఏస్ అకాడమీ), 4. నూర్ బాషా (వీజేవై). సబ్ జూనియర్ బాలురు: 1. స్నేహిత్ (జీటీటీఏ), 2. హరి కృష్ణ (ఎస్‌పీఎస్‌టీటీఏ), 3. సరోజ్ సిరిల్ (ఎస్‌పీఎస్‌టీటీఏ), 4. అలీ మహ్మద్ (ఎస్‌పీఎస్‌టీటీఏ). సబ్ జూనియర్ బాలికలు: 1. వైశాలి (ఏటీపీ), 2. నాగ శ్రావణి (ఏస్ అకాడమీ), 3. నూర్ బాషా (వీజేవై), 4. వరుణి జైస్వాల్ (జీఎస్ఎం). క్యాడెట్ బాలురు: 1. విష్ణు (జీటీటీఏ), 2. అద్వైత్ (ఏడబ్ల్యూఏ), 3. ఆదర్శ్ వర్ధన్ (వీజేవై), 4. వరుణ్ శంకర్ (జీటీటీఏ). క్యాడెట్ బాలికలు: 1. కాజోల్ (వీజేవై), 2. ఆయుష్ జియా (జీఎస్ఎం), 3. మహిత (వీజేవై), 4. నజీరబి (వీజేవై).