రాష్ట్ర ర్యాంకింగ్ టీటీ టోర్నీ
ఎల్బీ స్టేడియం: తెలంగాణ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్‌లో బాలబాలికల క్యాడెట్ సింగిల్స్ టైటిళ్లను బి.వరుణ్ శంకర్, అంజలి గెలుచుకున్నారు. సెయింట్ పాల్స్ హైస్కూల్ డైమండ్ జూబ్లీ సందర్భంగా హైదర్‌గూడలోని స్కూల్ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న ఈ పోటీల్లో ఆదివారం జరిగిన క్యాడెట్ బాలుర సింగిల్స్ ఫైనల్లో వరుణ్ శంకర్ (గ్లోబల్ టేబుల్ టెన్నిస్ అకాడమీ-జీటీటీఏ) 11-7, 14-12, 6-11, 13-11తో అద్వైత్ (ఆవా)పై విజయం సాధించాడు.
క్యాడెట్ బాలికల సింగిల్స్ ఫైనల్లో అంజలి (గుజరాతీ సేవామండలి-జీఎస్‌ఎం) 11-3, 6-11, 11-8, 11-7తో భవిత (జీఎస్‌ఎం)పై గెలిచింది. సబ్ జూనియర్ బాలికల సింగిల్స్‌లో జి. ప్రణీత (జీఎస్‌ఎం), వరుణి జైస్వాల్ (జీఎస్‌ఎం) ఫైనల్లోకి ప్రవేశించారు. తొలి సెమీఫైనల్లో ప్రణీత 12-10, 11-8, 8-11, 11-6తో రాగ నివేదిత (జీటీటీఏ)పై విజయం సాధించింది. రెండో సెమీఫైనల్లో వరుణి 11-7, 12-10, 12-10, 11-9తో వి.సస్య (ఆవా)పై గెలిచింది. సబ్ జూనియర్ బాలుర సింగిల్స్ సెమీస్‌లో సరోజ్ సిరిల్ (ఎస్‌పీటీటీఏ) 11-9, 11-6, 5-11, 12-10, 14-12తో సాయి తేజేశ్ (ఎస్‌పీటీటీఏ)పై, ఎస్.ఎఫ్.ఆర్.స్నేహిత్ (జీటీటీఏ) 11-9, 12-10, 9-11, 11-8, 11-7తో అమాన్ ఉల్ రెహ్మాన్ (ఎస్‌పీటీటీఏ)పై గెలిచారు.
ఫైనల్లో పోస్టల్, ఆర్‌బీఐ
ఇంటర్ ఇన్‌స్టిట్యూషన్ టీమ్ చాంపియన్‌షిప్‌లో పోస్టల్, ఆర్‌బీఐ జట్లు ఫైనల్లోకి చేరాయి. సెమీఫైనల్లో ఆర్‌బీఐ 3-1తో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)పై గెలిచింది. ఇదివరకే పోస్టల్ జట్లు ఫైనల్ పోరుకు అర్హత సంపాదించాయి.
వరుణ్, అంజలిలకు క్యాడెట్ టైటిల్స్
Published Sun, Jul 27 2014 11:45 PM | Last Updated on Sat, Sep 2 2017 10:58 AM
Advertisement
Advertisement