జింఖానా, న్యూస్‌లైన్: ఆలిండియా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) టేబుల్ టెన్నిస్ టోర్నీలో అండర్-14 బాలుర టీమ్ టైటిల్‌ను భారతీయ విద్యాభవన్ పబ్లిక్ స్కూల్ (బీవీబీపీఎస్, జూబ్లీహిల్స్) కైవసం చేసుకుంది.
ఈ టోర్నీలో తొలిసారిగా రాష్ట్రానికి చెందిన సీబీఎస్‌ఈ జట్టుకు స్వర్ణం రావడం విశేషం. బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో జరిగిన టీమ్ చాంపియన్‌షిప్ ఈవెంట్ ఫైనల్లో బీవీబీపీఎస్ 3-1తో డాన్ బాస్కో స్కూల్ (అస్సాం)పై విజయం సాధించింది. మొదటి సింగిల్స్‌లో స్నేహిత్ 11-5, 11-5, 13-11తో మిన్మోయ్‌పై గెలిచాడు. రెండో సింగిల్స్‌లో మితుల్ అగర్వాల్ 6-11, 8-11, 4-11తో అలీకో చేతిలో ఓటమి పాలయ్యాడు. మూడో సింగిల్స్‌లో వరుణ్ శంకర్ 11-8, 11-4, 11-9తో బేబ్రాజ్‌పై గెలిచాడు. దీంతో బీవీబీపీఎస్ జట్టుకు 2-1తో ఆధిక్యం లభించింది.
అనంతరం జరిగిన రివర్స్ సింగిల్స్‌లో సబ్ జూనియర్ విభాగంలో రాష్ట్ర నంబర్‌వన్ ఆటగాడైన స్నేహిత్ 11-7, 11-7, 3-11, 11-6తో సునాయాసంగా అలీకోను ఓడించి 3-1తో టైటిల్‌ను అందించాడు. ఈ టోర్నీలో అండర్-14 బాలుర వ్యక్తిగత విభాగంలో స్నేహిత్‌కు కాంస్యం దక్కింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో స్నేహిత్ 3-1తో రామ్ జైన్(రాజస్థాన్)పై నెగ్గాడు.
విజేత భారతీయ విద్యాభవన్
Published Fri, Nov 29 2013 11:56 PM | Last Updated on Sat, Sep 2 2017 1:06 AM
Advertisement
Advertisement