సెయింట్ పాల్స్ శుభారంభం | saint paul's grand opening | Sakshi
Sakshi News home page

సెయింట్ పాల్స్ శుభారంభం

Published Fri, Jul 25 2014 11:49 PM | Last Updated on Sat, Sep 2 2017 10:52 AM

saint paul's grand opening

తెలంగాణ టేబుల్ టెన్నిస్ టోర్నీ
 ఎల్బీ స్టేడియం: తెలంగాణ రాష్ట్ర ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్‌లో సెయింట్ పాల్స్, భారతీయ విద్యాభవన్ పబ్లిక్ స్కూల్ (బీవీబీపీఎస్-జూబ్లీహిల్స్) జట్లు శుభారంభం చేశాయి.
 
  హైదర్‌గూడలోని సెయింట్ పాల్స్ హైస్కూల్ డైమండ్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం మొదలైన ఈ ఇంటర్ స్కూల్ చాంపియన్‌షిప్ టీమ్ విభాగంలో సెయింట్ పాల్స్ హైస్కూల్ జట్టు 3-0తో డాన్ బాస్కో స్కూల్ జట్టుపై విజయం సాధించింది. సింగిల్స్‌లో దివేష్ (సెయింట్ పాల్స్) 11-4, 19-17, 11-7తో జీవన్‌పై, రిత్విక్ (సెయింట్ పాల్స్) 11-7, 11-4, 11-5తో నిఖిల్‌పై గెలిచారు. డబుల్స్‌లో దివేష్-రిత్విక్ జోడి 11-9, 11-3, 11-5తో జీవన్-నిఖిల్ జోడిపై గెలిచింది. మరో మ్యాచ్‌లో బీవీబీపీఎస్ (సి) జట్టు 3-2తో దేవసియా స్కూల్ జట్టుపై గెలిచింది.
 
  సింగిల్స్‌లో ధనుష్ (బీవీబీపీఎస్) 11-5, 11-8, 11-8తో వినయ్‌పై గెలిచాడు. రెండో సింగిల్స్‌లో మితుల్ (బీవీబీపీఎస్) 8-11, 9-11, 5-11తో ప్రద్యుమ్న(దేవసియా) చేతిలో ఓడిపోయాడు. డబుల్స్‌లో భువన్-మితుల్ (బీవీబీపీఎస్) జోడి 11-4, 11-4, 12-10తో ప్రద్యుమ్న-యతీష్ (దేవసియా) జోడిపై గెలిచింది. రివర్స్ సింగిల్స్‌లో ధనుష్ (బీవీబీపీఎస్) 9-11, 11-7, 8-11, 11-6, 4-11తో ప్రద్యుమ్న (దేవసియా) చేతిలో ఓడిపోగా, మితుల్ (బీవీబీపీఎస్) 11-7, 11-6, 12-10తో వినయ్(దేవసియా) పై నెగ్గాడు. ఇతర మ్యాచ్‌ల్లో లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ 3-0తో మెరిడియన్‌పై, ఓక్రిడ్జ్ స్కూల్ 3-0తో బీవీబీపీఎస్‌పై గెలిచాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement