స్నేహిత్ డబుల్ ధమాకా | state ranking table tennis tournment snehitha won title | Sakshi
Sakshi News home page

స్నేహిత్ డబుల్ ధమాకా

Published Fri, Nov 8 2013 12:21 AM | Last Updated on Sat, Sep 2 2017 12:23 AM

state ranking table tennis tournment snehitha won title

ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: రాష్ట్ర ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్‌లో జూనియర్, సబ్ జూనియర్ బాలుర సింగిల్స్ టైటిల్‌ను స్నేహిత్(జీపీటీటీఏ) కైవసం చేసుకున్నాడు.  స్వామి వివేకానంద 150వ జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ పోటీల్లో గురువారం జరిగిన సబ్ జూనియర్ బాలుర సింగిల్స్ ఫైనల్లో స్నేహిత్ 10-12, 1-9, 11-5, 8-11, 14-12, 11-8 స్కోరుతో హర్ష్ లోహిత్ (వైఎంసీఏ)పై విజయం సాధించాడు. జూనియర్ బాలుర సింగిల్స్ ఫైనల్లో స్నేహిత్ 11-8, 12-10, 4-11, 9-11, 8-11తో హర్ష్ లోహిత్‌పై నెగ్గాడు. ఇతర ఫలితాలిలా ఉన్నాయి...
 
 పురుషుల సింగిల్స్: 1.పి.విఘ్నయ్ రెడ్డి (ఆర్‌బీఐ), 2.గౌతమ్ కృష్ణ (ఆవా). యూత్ బాలుర  సింగిల్స్: 1.టి.సాయి ప్రణీత్ (విజయవాడ), 2.గౌతమ్ కృష్ణ (ఆవా). మహిళల సింగిల్స్: 1.నిఖత్ బాను (జీఎస్‌ఎం), 2.శ్రీజ (జీటీటీఏ). జూనియర్ బాలికల సింగిల్స్: 1.నైనా (ఎల్బీ స్టేడియం), 2.శ్రీజ (జీటీటీఏ). సబ్ జూనియర్ బాలికల సింగిల్స్: 1.శైలునూర్ బాషా (విజయవాడ). 2.కె.వి.వి.వైశాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement