టాప్ సీడ్‌గా నిఖత్ బాను | As the top seed nikitha banu | Sakshi
Sakshi News home page

టాప్ సీడ్‌గా నిఖత్ బాను

Published Fri, Oct 18 2013 12:01 AM | Last Updated on Fri, Sep 1 2017 11:44 PM

As the top seed nikitha banu

జింఖానా, న్యూస్‌లైన్: అనంత నారాయణ రెడ్డి, రామేశ్వరమ్మల స్మారక స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నీలో నిఖత్ బాను టాప్ సీడ్‌గా బరిలోకి దిగనుంది.  ఆనంద్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ స్పోర్ట్స్ అకాడమీ (ఏడబ్ల్యూఏఎస్‌ఏ) నిర్వహిస్తున్న ఈ టోర్నీలో ఆమెతో పాటు మౌనిక (జీఎస్‌ఎం), నూర్ బాషా (వీజేఏ), వైశాలి (ఏటీపీ) ఆడనున్నారు. శుక్రవారం ఈ టోర్నీని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి జస్టిస్ సి.వి శేష సాయి ముఖ్య అతిథిగా విచ్చేసి లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ టోర్నీ మూడు రోజుల పాటు జరగనుంది. టోర్నీలో పాల్గొనే ఇతర టాప్ సీడ్‌ల వివరాలు
 పురుషుల విభాగం: 1. విశాల్ (డెల్లాయిట్), 2. సోమంత్ ఘోష్ (ఎస్‌సీఆర్), 3. కృష్ణ కిరీటి (ఏజీస్), 4. సాయి ప్రణీత్.
 
 యూత్ బాలుర విభాగం: 1. సాయి ప్రణీత్ (వీజేఏ), 2. హర్ష (వైఎంసీఏ), 3. స్నేహిత్ (జీటీటీఏ), 4. గౌతమ్ కృష్ణ (ఏడబ్ల్యూఏ).
 
 యూత్ బాలికల విభాగం: 1. నిఖత్ బాను (జీఎస్‌ఎం), 2. మౌనిక (జీఎస్‌ఎం), 3. సైరా బాను (వీజేవై), 4. రాగ నివేదిత (జీటీటీఏ).
 
 జూనియర్ బాలురు: 1. హర్ష (వైఎంసీఏ), 2. అలీ మహ్మద్ (ఎస్‌పీఎస్‌టీటీఏ), 3. హరికృష్ణ (ఎస్‌పీఎస్‌టీటీఏ), 4. పవన్ కుమార్ (ఎస్‌పీఎస్‌టీటీఏ).
 
 జూనియర్ బాలికలు: 1. వైశాలి (ఏటీపీ), 2. మౌనిక (జీఎస్‌ఎం), 3. నాగ శ్రావణి (ఏస్ అకాడమీ), 4. నూర్ బాషా (వీజేవై).
 
 సబ్ జూనియర్ బాలురు: 1. స్నేహిత్ (జీటీటీఏ), 2. హరి కృష్ణ (ఎస్‌పీఎస్‌టీటీఏ), 3. సరోజ్ సిరిల్ (ఎస్‌పీఎస్‌టీటీఏ), 4. అలీ మహ్మద్ (ఎస్‌పీఎస్‌టీటీఏ).
 
 సబ్ జూనియర్ బాలికలు: 1. వైశాలి (ఏటీపీ), 2. నాగ శ్రావణి (ఏస్ అకాడమీ), 3. నూర్ బాషా (వీజేవై), 4. వరుణి జైస్వాల్ (జీఎస్‌ఎం).
 
 క్యాడెట్ బాలురు: 1. విష్ణు (జీటీటీఏ), 2. అద్వైత్ (ఏడబ్ల్యూఏ), 3. ఆదర్శ్ వర్ధన్ (వీజేవై), 4. వరుణ్ శంకర్ (జీటీటీఏ).
 
 క్యాడెట్ బాలికలు: 1. కాజోల్ (వీజేవై), 2. ఆయుష్ జియా (జీఎస్‌ఎం), 3. మహిత (వీజేవై), 4. నజీరబి (వీజేవై).
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement