క్యాడెట్ చాంప్స్ విష్ణు, ఆయుషి | cadet champion vishunu,Ayushi | Sakshi
Sakshi News home page

క్యాడెట్ చాంప్స్ విష్ణు, ఆయుషి

Published Sun, Oct 20 2013 12:14 AM | Last Updated on Fri, Sep 1 2017 11:47 PM

cadet champion vishunu,Ayushi

జింఖానా, న్యూస్‌లైన్: అనంత నారాయణ రెడ్డి, రామేశ్వరమ్మ స్మారక స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నీలో క్యాడెట్ బాలుర విభాగంలో విష్ణు, బాలికల విభాగంలో ఆయుషి విజేతలుగా నిలిచారు. ఆనంద్‌నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ స్పోర్ట్స్ అకాడమీ (ఏడబ్ల్యూఏఎస్‌ఏ) నిర్వహిస్తున్న ఈ టోర్నీలో శనివారం జరిగిన ఫైనల్లో విష్ణు (జీటీటీఏ) 11-9, 11-8, 11-9తో అద్వైత్‌పై, ఆయుషి (జీఎస్‌ఎం) 11-9, 13-11, 11-5తో కాజోల్‌పై విజయం సాధించారు.
 
  మహిళల విభాగంలో నిఖత్ బాను (జీఎస్‌ఎం) 11-6, 11-5, 11-2తో ప్రణీత (ఐటీ)పై నెగ్గి సెమీస్‌కు చేరుకుంది. తనతో పాటుగా వైశాలి (ఏటీపీ) 11-9, 5-11, 10-12, 6-11, 11-6, 12-10, 11-3తో అనూష రెడ్డి (వీజేఏ)పై, నాగ శ్రావణి (ఏస్ అకాడమీ) 12-10, 7-11, 9-11, 11-8, 11-6, 11-2తో నూర్ బాషా (వీజేఏ)పై, మౌనిక (జీఎస్‌ఎం) 11-3, 11-2, 11-5, 11-4తో సైరా బాను (వీజేఏ)పై గెలుపొందారు.  
 
 ఇతర ఫలితాలు
 సబ్ జూనియర్ బాలికల క్వార్టర్ ఫైనల్స్: వైశాలి (ఏటీపీ) 11-5, 9-11, 11-9, 11-6, 11-8తో అనూష రెడ్డి (వీజేఏ)పై, వరుణి జైస్వాల్ (జీఎస్‌ఎం) 11-3, 11-5, 11-9, 11-5తో సాస్య (ఏడబ్ల్యూఏ)పై, నూర్ బాషా (వీజేఏ) 8-11, 13-11, 8-11, 11-9, 5-11, 11-8, 11-6తో  ప్రణీత (జీఎస్‌ఎం)పై, నాగ శ్రావణి (ఏస్ అకాడమీ) 6-11, 12-10, 11-8, 5-11, 14-12, 17-15తో లాస్య (ఏడ బ్ల్యూఏ)పై నెగ్గారు.
 
 జూనియర్ బాలికల క్వార్టర్ ఫైనల్స్: వైశాలి (ఏటీపీ) 12-10, 11-9, 11-8, 9-11, 11-6తో సైరా బాను (వీజేఏ)పై, నూర్ బాషా (వీజేఏ) 13-11, 11-1, 11-5, 11-8, 11-9తో అనూష రెడ్డి (వీజేఏ)పై, వరుణి జైస్వాల్ (జీఎస్‌ఎం) 13-11, 3-11, 11-4, 11-9, 11-6తో నాగ శ్రావణి (ఏస్ అకాడమీ)పై, మౌనిక (జీఎస్‌ఎం) 11-8, 11-9, 12-14, 4-11, 11-6, 11-7తో లాస్య (ఏడబ్ల్యూఏ)పై గెలిచారు.
 
 యూత్ బాలికల క్వార్టర్ ఫైనల్స్: నిఖత్ బాను (జీఎస్‌ఎం) 11-2, 11-8, 11-6, 11-9తో లాస్య (ఏడబ్ల్యూఏ)పై, నూర్ బాషా (వీజేఏ) 11-6, 11-6, 14-12, 11-5తో రాగనివేదిత (జీటీటీఏ)పై, కాజోల్ (వీజేఏ) 5-11, 11-7, 6-11, 11-9, 11-9, 3-11, 11-7తో సైరా బాను (వీజేఏ)పై, మైనిక (జీఎస్‌ఎం) 11-6, 15-13, 12-10, 11-1తో నాగ శ్రావణి (ఏస్ అకాడమీ)పై గెలుపొందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement