నార్త్‌జోన్ జాతీయ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నీలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి నైనా జైస్వాల్ రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన సబ్ జూనియర్ బాలికల ఫైనల్లో మౌమితా దాస్ (పశ్చిమ బెంగాల్) 4-3తో నైనాపై గెలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది.
న్యూఢిల్లీ: నార్త్‌జోన్ జాతీయ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నీలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి నైనా జైస్వాల్ రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన సబ్ జూనియర్ బాలికల ఫైనల్లో మౌమితా దాస్ (పశ్చిమ బెంగాల్) 4-3తో నైనాపై గెలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది.
హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థికి దీటుగా జవాబిచ్చిన నైనా ఆఖరి గేమ్‌లో కాస్త నిరాశపర్చింది. నిర్ణయాత్మక గేమ్‌లో ఇద్దరు చాలా జాగ్రత్తగా ఆడారు. అయితే మౌమితా బలమైన ఫోర్‌హ్యాండ్ షాట్స్‌తో అటాకింగ్ గేమ్‌ను ఆడింది. దీనికి అడ్డుకట్ట వేయడంలో నైనా విఫలమైంది.