జింఖానా, న్యూస్‌లైన్: కూచ్ బెహర్ అండర్-19 క్రికెట్ ట్రోఫీలో భాగంగా హైదరాబాద్, ఛత్తీస్‌గఢ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. జింఖానా మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో నాలుగో రోజు తన రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన హైదరాబాద్ 66 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది.
చైతన్య రెడ్డి (162 బంతుల్లో 111 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీతో కదం తొక్కగా... అనిరుధ్ (60) అర్ధ సెంచరీతో రాణించాడు. తన్మయ్ అగర్వాల్ (33), కేఎస్‌కే చైతన్య (34 నాటౌట్) ఫర్వాలేదనిపించారు. ఛత్తీస్‌గఢ్ బౌలర్ ఇర్ఫాన్ 3 వికెట్లు తీసుకున్నాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 138/5తో బరిలోకి దిగిన ఛత్తీస్‌గఢ్ 96.4 ఓవర్లలో 190 పరుగులు చేసి ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలుపుకుని ఛత్తీస్‌గఢ్ 164 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. దీంతో ఛత్తీస్‌గఢ్‌కు 3 పాయింట్లు దక్కగా... హైదరాబాద్ ఒక పాయింట్‌తో సరిపెట్టుకుంది.
చైతన్య శతకం
Published Thu, Dec 26 2013 12:05 AM | Last Updated on Sat, Sep 2 2017 1:57 AM
Advertisement