ఎల్బీ స్టేడియం: దివంగత ప్రొఫెసర్ కె. జయశంకర్ స్మారక ఓపెన్ హాకీ టోర్నమెంట్ జింఖానా మైదానంలో ఈనెల 6వ తేదీన నిర్వహించనున్నారు. యంగ్‌టర్క్స్ హాకీ క్లబ్ ఆధ్వర్యంలో జయశంకర్ జయంతి సందర్భంగా నిర్వహించే ఈ టోర్నీలో పాఠశాలలు, జూనియర్ కాలేజి డిపార్ట్‌మెంట్ జట్లు పాల్గొననున్నాయి. ఆసక్తి గల వారు ఆర్గనైజింగ్ సెక్రటరీ అశోక్ ముదిరాజ్‌ను 97003-07544 ఫోన్ నంబర్‌లో సంప్రదించవచ్చు.
రేపు ఓపెన్ చెస్ టోర్నీ
హైదరాబాద్ జిల్లా చెస్ టోర్నమెంట్ కమ్ సెలక్షన్ ట్రయల్స్ ఆదివారం (3న) నిర్వహించనున్నారు. హైదరాబాద్ జిల్లా చెస్ అసోసియేషన్ సౌజన్యంతో సూపర్ కిడ్స్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో అండర్-7 బాలబాలికల చెస్ టోర్నీ రాంనగర్‌లోని అకాడమీలో జరగనుంది. జిల్లా మహిళల చెస్ టోర్నీ కూడా అదే రోజు నిర్వహిస్తారు. వివరాలకు టోర్నీ డెరైక్టర్ కె. దయానంద్ (96526-17524)ను సంప్రదించవచ్చు.
11నుంచి ఓల్డ్ సిటీ క్రీడలు
హైదరాబాద్ ఓల్డ్ సిటీ ఇంటర్ స్కూల్ క్రీడలు ఈనెల 11 నుంచి 19 వరకు కులీ కుతుబ్‌షా స్టేడియంలో జరగనున్నాయి. ఓల్డ్ సిటీ స్కూల్ గేమ్స్ అసోసియేషన్ (ఓసీఎస్‌జీఏ) ఆధ్వర్యంలో జరిగే ఈ ఈవెంట్‌లో క్రికెట్, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, కబడ్డీల్లో పోటీలను నిర్వహిస్తారు. ఆసక్తి గల వారు తమ ఎంట్రీలను ఈనెల 9లోగా పంపించాలి. వివరాలకు ఓసీఎస్‌జీఏ ప్రధాన కార్యదర్శి ఎం.డి. ఫజిలత్ అహ్మద్(97000-08253)ను సంప్రదించవచ్చు.
6న జయశంకర్ స్మారక హాకీ టోర్నీ
Published Fri, Aug 1 2014 11:42 PM | Last Updated on Sat, Sep 2 2017 11:14 AM
Advertisement
Advertisement