K.Jayashankar
-
వరంగల్‌కు పురుషుల టైటిల్
ప్రొ. జయశంకర్ స్మారక హ్యాండ్‌బాల్ ఎల్బీ స్టేడియం: ప్రొఫెసర్ కె. జయశంకర్ స్మారక హ్యాండ్‌బాల్ టోర్నమెంట్లో పురుషుల టీమ్ టైటిల్‌ను వరంగల్ జట్టు కైవసం చేసుకుంది. హైదరాబాద్ జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్(హెచ్‌డీహెచ్‌ఏ) సౌజన్యంతో తెలంగాణ స్పోర్ట్స్ ఫెడరేషన్ (టీఎస్ఎఫ్) ఆధ్వర్యంలో గురువారం జరిగిన ఫైనల్లో వరంగల్ 25-19 స్కోరుతో ఎల్బీ స్టేడియం జట్టుపై విజయం సాధించింది. తొలి అర్ధభాగంలో వరంగల్ జట్టు 15-12తో ఆధిక్యాన్ని సాధించింది. వరంగల్ జట్టులో అశోక్ 10 గోల్స్, ఆర్. సింగ్ 6 గోల్స్ చేశారు. ఎల్బీ స్టేడియం జట్టులో రాజ్ కుమార్, వాసు చెరో 8 గోల్స్ చేశారు. ఈ టోర్నీలో బెస్ట్ ప్లేయర్‌గా అశోక్ (వరంగల్) ఎంపికయ్యాడు. సెమీఫైనల్లో వరంగల్ జట్టు 15-13స్కోరుతో సికింద్రాబాద్ ఏఓసీ సెంటర్‌పై, ఎల్బీ స్టేడియం జట్టు 12-10 స్కోరుతో నేషనల్ పోలీస్ అకాడమీ (ఎన్పీఏ) జట్టుపై గెలిచాయి. మహిళల చాంప్ సాయ్: మహిళల విభాగంలో సాయ్ ఎస్టీసీ (సరూర్‌నగర్) జట్టు విజేతగా నిలిచింది. ఎల్బీ స్టేడియం జట్టు రెండో స్థానం సాధించగా, మహర్షి విద్యా మందిర్‌కు మూడో స్థానం దక్కింది. ఫైనల్లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) జట్టు 15-13 స్కోరుతో ఎల్బీ స్టేడియం జట్టుపై గెలిచింది. సాయ్ జట్టులో రమ్య 10 గోల్స్ చేసి బెస్ట్ ప్లేయర్ అవార్డును అందుకుంది. సెమీఫైనల్లో సాయ్ ఎస్టీసీ జట్టు 12-6తో సెయింట్ పాయిస్ కాలేజిపై, ఎల్బీ స్టేడియం 9-6తో మహర్షి విద్యా మందిర్‌పై గెలిచాయి. హాకీ విజేత సెయింట్ పీటర్స్ స్కూల్ హాకీ టోర్నమెంట్లో సెయింట్ పీటర్స్ హైస్కూల్ జట్టు విజేతగా నిలిచింది. జింఖానా మైదానంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సెయింట్ పీటర్స్ జట్టు 1-0తో భవాన్స్ జూనియర్ కాలేజి జట్టుపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో నమోదైన ఏకైక గోల్‌ను సెయింట్ పీటర్స్ ఆటగాడు అజహర్ సాధించాడు. సెమీఫైనల్లో సెయింట్ పీటర్స్ స్కూల్ 1-0తో విజయా హైస్కూల్ (కాప్రా)పై, భవాన్స్ జూనియర్ కాలేజి 1-0తో కేంద్రీయ విద్యాలయ (తిరుమలగిరి)పై నెగ్గాయి. -
హైదరాబాద్ క్లబ్ గెలుపు
ప్రొ. జయశంకర్ స్మారక హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్ సాక్షి, హైదరాబాద్: దివంగత ప్రొఫెసర్ కె. జయశంకర్ జయంతి సందర్భంగా నిర్వహించిన హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ హ్యాండ్‌బాల్ క్లబ్, ఏఓసీ జట్లు విజయాలు నమోదు చేశాయి. తొలి రోజు జరిగిన పురుషుల విభాగం మ్యాచ్‌ల్లో హైదరాబాద్ క్లబ్ 12-10తో ఏవీ కాలేజిపై, ఏఓసీ 17-12తో కరీంనగర్‌పై గెలుపొందాయి. మరో మ్యాచ్‌లో కరీంనగర్ 7-1తో కెన్నెడి ఇన్స్టిట్యూషన్పై, సాయి ఎస్టీసీ (సరూర్‌నగర్) 11-5తో కాంబాట్ అకాడమీపై, నేషనల్ పోలీస్ అకాడమీ 8-1తో మెదక్‌పై, రంగారెడ్డి 6-3తో నల్లగొండపై, కాంబాట్ 12-3తో గతి స్పోర్ట్స్ క్లబ్‌పై, వరంగల్ 11-7తో ప్రేమండల్ స్పోర్ట్స్ క్లబ్‌పై విజయం సాధించాయి. మహిళల విభాగంలో వనిత డిగ్రీ కాలేజి 5-4తో కెన్నెడి ఇన్స్టిట్యూషన్పై, సాయి ఎస్టీసీ (సరూర్‌నగర్) 7-2తో నల్లగొండపై, మహర్షి విద్యామందిర్ 7-2తో గతి స్పోర్ట్స్ క్లబ్‌పై, మెదక్ 2-1తో గతి స్పోర్ట్స్ క్లబ్‌పై గెలుపొందాయి. అంతకుముందు జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ముఖ్య అతిథిగా హాజరై ఈవెంట్‌ను ఆరంభించారు. చెస్ విజేత రామానుజచారులు ప్రొఫెసర్ జయశంకర్ స్మారక చెస్ టోర్నీలో ఎన్. రామానుజచారులు విజేతగా నిలిచాడు. ఇందులో షేక్ ఫయాజ్ రెండో స్థానం దక్కించుకోగా, భరత్ కుమార్ మూడో స్థానంలో నిలిచాడు. ఉత్తమ అండర్-19, 13 ఆటగాళ్లుగా కె. తరుణ్, ప్రణయ్ అవార్డు అందుకున్నారు. త్రిష ఉత్తమ మహిళ అవార్డు చేజిక్కించుకుంది. -
6న జయశంకర్ స్మారక హాకీ టోర్నీ
ఎల్బీ స్టేడియం: దివంగత ప్రొఫెసర్ కె. జయశంకర్ స్మారక ఓపెన్ హాకీ టోర్నమెంట్ జింఖానా మైదానంలో ఈనెల 6వ తేదీన నిర్వహించనున్నారు. యంగ్‌టర్క్స్ హాకీ క్లబ్ ఆధ్వర్యంలో జయశంకర్ జయంతి సందర్భంగా నిర్వహించే ఈ టోర్నీలో పాఠశాలలు, జూనియర్ కాలేజి డిపార్ట్మెంట్ జట్లు పాల్గొననున్నాయి. ఆసక్తి గల వారు ఆర్గనైజింగ్ సెక్రటరీ అశోక్ ముదిరాజ్‌ను 97003-07544 ఫోన్ నంబర్లో సంప్రదించవచ్చు. రేపు ఓపెన్ చెస్ టోర్నీ హైదరాబాద్ జిల్లా చెస్ టోర్నమెంట్ కమ్ సెలక్షన్ ట్రయల్స్ ఆదివారం (3న) నిర్వహించనున్నారు. హైదరాబాద్ జిల్లా చెస్ అసోసియేషన్ సౌజన్యంతో సూపర్ కిడ్స్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో అండర్-7 బాలబాలికల చెస్ టోర్నీ రాంనగర్‌లోని అకాడమీలో జరగనుంది. జిల్లా మహిళల చెస్ టోర్నీ కూడా అదే రోజు నిర్వహిస్తారు. వివరాలకు టోర్నీ డెరైక్టర్ కె. దయానంద్ (96526-17524)ను సంప్రదించవచ్చు. 11నుంచి ఓల్డ్ సిటీ క్రీడలు హైదరాబాద్ ఓల్డ్ సిటీ ఇంటర్ స్కూల్ క్రీడలు ఈనెల 11 నుంచి 19 వరకు కులీ కుతుబ్‌షా స్టేడియంలో జరగనున్నాయి. ఓల్డ్ సిటీ స్కూల్ గేమ్స్ అసోసియేషన్ (ఓసీఎస్జీఏ) ఆధ్వర్యంలో జరిగే ఈ ఈవెంట్లో క్రికెట్, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, కబడ్డీల్లో పోటీలను నిర్వహిస్తారు. ఆసక్తి గల వారు తమ ఎంట్రీలను ఈనెల 9లోగా పంపించాలి. వివరాలకు ఓసీఎస్జీఏ ప్రధాన కార్యదర్శి ఎం.డి. ఫజిలత్ అహ్మద్(97000-08253)ను సంప్రదించవచ్చు.