ప్రొ. జయశంకర్ స్మారక హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్
సాక్షి, హైదరాబాద్: దివంగత ప్రొఫెసర్ కె. జయశంకర్ జయంతి సందర్భంగా నిర్వహించిన హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ హ్యాండ్‌బాల్ క్లబ్, ఏఓసీ జట్లు విజయాలు నమోదు చేశాయి. తొలి రోజు జరిగిన పురుషుల విభాగం మ్యాచ్‌ల్లో హైదరాబాద్ క్లబ్ 12-10తో ఏవీ కాలేజిపై, ఏఓసీ 17-12తో కరీంనగర్‌పై గెలుపొందాయి.
మరో మ్యాచ్‌లో కరీంనగర్ 7-1తో కెన్నెడి ఇన్‌స్టిట్యూషన్‌పై, సాయి ఎస్‌టీసీ (సరూర్‌నగర్) 11-5తో కాంబాట్ అకాడమీపై, నేషనల్ పోలీస్ అకాడమీ 8-1తో మెదక్‌పై, రంగారెడ్డి 6-3తో నల్లగొండపై, కాంబాట్ 12-3తో గతి స్పోర్ట్స్ క్లబ్‌పై, వరంగల్ 11-7తో ప్రేమండల్ స్పోర్ట్స్ క్లబ్‌పై విజయం సాధించాయి. మహిళల విభాగంలో వనిత డిగ్రీ కాలేజి 5-4తో కెన్నెడి ఇన్‌స్టిట్యూషన్‌పై, సాయి ఎస్‌టీసీ (సరూర్‌నగర్) 7-2తో నల్లగొండపై, మహర్షి విద్యామందిర్ 7-2తో గతి స్పోర్ట్స్ క్లబ్‌పై, మెదక్ 2-1తో గతి స్పోర్ట్స్ క్లబ్‌పై గెలుపొందాయి. అంతకుముందు జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ముఖ్య అతిథిగా హాజరై ఈవెంట్‌ను ఆరంభించారు.
చెస్ విజేత రామానుజచారులు
ప్రొఫెసర్ జయశంకర్ స్మారక చెస్ టోర్నీలో ఎన్. రామానుజచారులు విజేతగా నిలిచాడు. ఇందులో షేక్ ఫయాజ్ రెండో స్థానం దక్కించుకోగా, భరత్ కుమార్ మూడో స్థానంలో నిలిచాడు. ఉత్తమ అండర్-19, 13 ఆటగాళ్లుగా కె. తరుణ్, ప్రణయ్ అవార్డు అందుకున్నారు. త్రిష ఉత్తమ మహిళ అవార్డు చేజిక్కించుకుంది.
హైదరాబాద్ క్లబ్ గెలుపు
Published Thu, Aug 7 2014 12:14 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement