వైష్ణవి ఓటమి | vaishanavi lost game in open ranking tennis tournment | Sakshi
Sakshi News home page

వైష్ణవి ఓటమి

Published Sat, Jan 25 2014 12:07 AM | Last Updated on Sat, Sep 2 2017 2:57 AM

vaishanavi lost game in open ranking tennis tournment

జింఖానా, న్యూస్‌లైన్: ఆలిండి యా ఓపెన్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వైష్ణవి పెద్ది రెడ్డి పరాజయం పాలైంది. సికింద్రాబాద్ క్లబ్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో శుక్రవారం జరిగిన మహిళల సెమీఫైనల్లో వైష్ణవి 3-5తో టాప్ సీడ్ వానియా దంగ్వాల్ (ఢిల్లీ) చేతిలో ఓటమి పాలైంది.

ఇతర మ్యాచ్‌ల్లో రియా భాటియా (ఢిల్లీ) 7-5, 6-4తో అమృత ముఖర్జీ (పశ్చిమ బెంగాల్)పై గెలిచింది. పురుషుల విభాగంలో లక్షిత్ సూద్ (ఉత్తరప్రదేశ్) 6-3, 4-6, 6-0తో విజయ్ కన్నన్ (తమిళనాడు)పై, వినోద్ శ్రీధర్ (తమిళనాడు) 6-2, 6-3తో అంకిత్ సచ్‌దేవా (ఢిల్లీ)పై నెగ్గి ఫైనల్స్‌కు చేరుకున్నారు.
 
  డబుల్స్ విభాగం సెమీఫైనల్లో కునాల్ ఆనంద్-సాగర్ మంజన జోడి 6-4, 6-4తో సాగర్ అహూజ-షాబాజ్ ఖాన్‌పై, విజయ్ కన్నన్- ఫరీజ్ మహ్మద్ జోడి 6-3, 0-6, 10-2తో అర్పిత్ శర్మ-లక్షిత్ సూద్ జోడిపై గెలిచారు. మహిళల డబుల్స్ విభాగం సెమీఫైనల్లో అమృత ముఖర్జీ-లిఖిత శెట్టి జంట 6-3, 6-1తో నిత్యా రాజ బాబు-స్నేహ పడమట జంటను, అరంటా ఆండ్రెడా-అనుష్క భార్గవ జంట 6-4, 7-5తో రియా భాటియా-వానియా దంగ్వాల్ జంటను ఓడించి ఫైనల్స్‌లో అడుగు పెట్టాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement