దేశవాళీ టోర్నీలకు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నుంచి ఉత్తమ అంపైర్ పురస్కారం అందుకోనున్న చెట్టితోడి శంషుద్దీన్‌కు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అభినందనలు తెలిపింది.
జింఖానా, న్యూస్‌లైన్: దేశవాళీ టోర్నీలకు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నుంచి ఉత్తమ అంపైర్ పురస్కారం అందుకోనున్న చెట్టితోడి శంషుద్దీన్‌కు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అభినందనలు తెలిపింది.
జనవరి 11న ముంబైలో జరిగే కార్యక్రమంలో ఆయన ఈ అవార్డును అందుకోనున్నారు. 1970 మార్చి 22న జన్మించిన శంషుద్దీన్ 2012 నుంచి అంతర్జాతీయ మ్యాచ్‌లకు కూడా అంపైర్‌గా వ్యవహరిస్తున్నారు. 2012తో బీసీసీఐ శంషుద్దీన్‌ను ఐసీసీ అంతర్జాతీయ అంపైర్ల ప్యానెల్‌కు నామినేట్ చేసింది. కెరీర్‌లో ఇప్పటివరకు ఆయన మూడు టి20, ఒక వన్డే అంతర్జాతీయ మ్యాచ్‌లలో అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.