రానా మరో సినిమా మొదలెట్టేశాడు | Rana,Teja film shoot started | Sakshi
Sakshi News home page

రానా మరో సినిమా మొదలెట్టేశాడు

Oct 13 2016 1:21 PM | Updated on Aug 11 2019 12:52 PM

రానా మరో సినిమా మొదలెట్టేశాడు - Sakshi

రానా మరో సినిమా మొదలెట్టేశాడు

స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన హీరో క్యారెక్టర్లకే ఫిక్స్ అయిపోకుండా అన్ని రకాల పాత్రలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో రానా. ఇప్పటికే తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న...

స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన హీరో క్యారెక్టర్లకే ఫిక్స్ అయిపోకుండా అన్ని రకాల పాత్రలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో రానా. ఇప్పటికే తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న రానా.. బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు. అదే జోరు లో ఇప్పుడు హీరోగా కూడా సత్తా చాటడానికి రెడీ అవుతున్నాడు.

ఇప్పటికే బాహుబలి తో పాటు మరో బహుభాషా చిత్రం ఘూజీ షూటింగ్ లను పూర్తి చేసిన రానా, ఇక టాలీవుడ్ మీద దృష్టి పెట్టాడు. సెన్సేషనల్ దర్శకుడు తేజ దర్శకత్వంలో ఓ సినిమాను ప్రారంభించాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మధురై దగ్గరలోని కరైకుడిలో ప్రారంభమైంది. రానాతో పాటు కాజల్, కేథరిన్ లు పాల్గొంటున్న ఈ షెడ్యూల్ పది రోజుల పాటు జరగనుంది.

తరువాత హైదరాబాద్ లో మరో భారీ షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారు. చాలా రోజులుగా సరైన హిట్ లేని తేజ ఈ సారి ఎలాగైన భారీ సక్సెస్ తో సత్తా చాటాలని చూస్తున్నాడు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో రానా కూడా సోలో హీరోగా సక్సెస్ కొట్టాలని భావిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement