పదేళ్ల తరువాత ఆ ఇద్దరితో..! | Kajal Agarwal film with Teja and Kalyan Ram | Sakshi
Sakshi News home page

పదేళ్ల తరువాత ఆ ఇద్దరితో..!

Published Sat, May 13 2017 12:31 PM | Last Updated on Sun, Aug 11 2019 12:52 PM

పదేళ్ల తరువాత ఆ ఇద్దరితో..! - Sakshi

పదేళ్ల తరువాత ఆ ఇద్దరితో..!

టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన అందాల భామ కాజల్ అగర్వాల్.. ప్రస్తుతం వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బందుల్లో పడింది. ఒక దశలో కెరీర్ ముగిసిపోయినట్టే అని భావించినా.. మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150తో తిరిగి ఫాంలోకి వచ్చింది. ప్రస్తుతం అజిత్, విజయ్ లాంటి టాప్ హీరోల సరసన నటిస్తున్న ఈ బ్యూటి ఇంట్రస్టింగ్ కాంబినేషన్ లను రిపీట్ చేస్తోంది.

తెలుగులో లక్ష్మీ కళ్యాణం సినిమాతో పరిచయం అయిన కాజల్, ఆ సినిమాలో కళ్యాణ్ రామ్కు జోడిగా తేజ దర్శకత్వంలో నటించింది. ప్రస్తుతం మరోసారి తేజ దర్శకత్వంలో రానాకు జోడిగా నేనే రాజు నేనే మంత్రి సినిమాలో నటిస్తున్న కాజల్, కళ్యాణ్ రామ్ తోనూ నటించేందుకు అంగీకరించింది. కొత్త దర్శకుడు ఉపేంద్ర డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఎమ్మెల్యే సినిమాలో కళ్యాణ్ రామ్ కు జోడిగా నటించనుంది కాజల్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement