
అల్లుడు శీను సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భారీ చిత్రాలు చేస్తూ సత్తా చాటుతున్నాడు. అయితే కెరీర్ మలుపు తిప్పే భారీ కమర్షియల్ హిట్ మాత్రం ఇంత వరకు దక్కలేదు. తాజాగా ఈ యంగ్ హీరో తేజ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ థాయ్ లాండ్‌లో జరుగుతోంది.
షూటింగ్ కి సంబంధించిన అప్‌డేట్స్ ను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నాడు సాయి శ్రీనివాస్. అయితే అలా షేర్ చేసిన ఫోటో ఒకటి వివాదాస్పదంగా మారింది. ఏనుగు దంతాలపై కూర్చొని పోజ్ ఇచ్చిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అలా మూగజీవి మీద కూర్చొని ఫోటో దిగటం జీవ హింస కిందకే వస్తుందంటున్నారు జంతు ప్రేమికులు. అయితే శ్రీనివాస్ ఆ ఫోటోను తన ట్విటర్ నుంచి తొలగించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment