
యంగ్ హీరోలు సీనియర్ హీరోలు అన్న తేడా లేకుండా ఫుల్ ఫాంలో సినిమాలు చేస్తున్న టాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్. ఇక కెరీర్ ముగిసిపోనట్టే అనుకుంటున్న సమయంలో బౌన్స్ బ్యాక్ అయిన భామ ప్రస్తుతం యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు కాజల్. తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ థాయ్‌లాండ్‌లోని నఖోమ్ పాథోమ్ ప్రావిన్స్‌లో జరుగుతోంది.
షూటింగ్ అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సందడి చేస్తున్న చిత్రయూనిట్ తాజాగా ఓ ఆసక్తికర వీడియోను పోస్ట్ చేశారు. హీరోయిన్ ఓ భారీ కొండచిలువను మెడలో వేసుకొని కెమెరాకు ఫోజ్ ఇస్తున్న వీడియో సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతుంది. దర్శకుడు తేజ తన ఇన్స్‌స్టాగ్రామ్ పేజ్‌లో ఈ వీడియోను షేర్ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment